Begin typing your search above and press return to search.

త్రిష, సమంత ఇద్దరిలో బాలీవుడ్ హీరో ఓటు ఎవరికి..?

ఈ సినిమాను సౌత్ లో కూడా రిలీజ్ చేసే ఆలోచనతో సౌత్ హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 6:30 AM GMT
త్రిష, సమంత ఇద్దరిలో బాలీవుడ్ హీరో ఓటు ఎవరికి..?
X

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. సల్మాన్ సినిమా అంటే హీరోయిన్స్ గురించి కూడా హీరో ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకుంటారు. ఇన్నాళ్లు బాలీవుడ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన సల్మాన్ ఖాన్ ఈసారి సౌత్ హీరోయిన్ తో జత కట్టాలని చూస్తున్నాడు. తన అప్ కమింగ్ మూవీ ది బుల్ సినిమాలో హీరోయిన్ గా ఇద్దరు సౌత్ హీరోయిన్స్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. వారిలో ఎవరు ఫైనల్ అన్నది మాత్రం తెలియట్లేదు.

సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణు వర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది బుల్ సినిమా లో హీరోయిన్ గా త్రిషని తీసుకోవాలని ముందు అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమని తెలిసి త్రిష ప్లేస్ లో సమంతని రీ ప్లేస్ చేయాలని అనుకున్నారట. ఈ సినిమాను సౌత్ లో కూడా రిలీజ్ చేసే ఆలోచనతో సౌత్ హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు. త్రిష, సమంత ఇద్దరు హీరోయిన్స్ కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు హీరోయిన్ అయినా సౌత్ లో ముఖ్యంగా తెలుగు, తమిళ్ లో సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుంది.

అందుకే అయితే త్రిష లేదంటే సమంత అన్నట్టుగా మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. హీరోయిన్ ఎంపిక సల్మాన్ చేతిలో పెట్టారట దర్శక నిర్మాతలు. ఆయన ఎవరికి ఓటు వేస్తే ఆమెను ఫైనల్ గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట. అయితే సల్మాన్ ఖాన్ కూడా ఇద్దరిలో ఎవరు డేట్స్ ఇస్తే వారితో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. బాలీవుడ్ లో త్రిష లాంగ్ బ్యాక్ సినిమా చేసింది. అయితే ఈమధ్య పి.ఎస్ 1 , 2 సినిమాలతో ఆమె అక్కడ ఆడియన్స్ కు దగ్గరైంది. విజయ్ లియోలో కూడా హీరోయిన్ త్రిషనే కాబట్టి బీ టౌన్ ఆడియన్స్ కు త్రిషని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇక సమంత అయినా కూడా ఓ పక్క అక్కడ వెబ్ సీరీస్ లు చేస్తూనే పుష్ప 1 లో ఉ అంటావా మామ సాంగ్ తో ఉర్రూతలూగించింది. సో సమంత హీరోయిన్ గా చేసినా కూడా సల్మాన్ సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుంది. ఇంతకీ సల్మాన్ ది బుల్ సినిమాలో ఫైనల్ హీరోయిన్ ఎవరు.. సల్మాన్ తో జత కట్ట ఛాన్స్ ఎవరు అందుకున్నారన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.