Begin typing your search above and press return to search.

మ‌న్సూర్ క్ష‌మాప‌ణ‌ల‌తో క‌రిగిపోయిన త్రిష‌

ఇక త్రిష‌కు సారీ చెబుతూ మ‌న్సూర్ రాసిన లేఖ‌ మర్యాదపూర్వకంగా కనిపించింది. ఇప్పుడు త్రిష తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో అతని క్షమాపణపై స్పందిస్తూ ఎంతో జాలి త‌ల‌చారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 3:09 PM GMT
మ‌న్సూర్ క్ష‌మాప‌ణ‌ల‌తో క‌రిగిపోయిన త్రిష‌
X

ప్రధానంగా తమిళ చిత్రాలలో నెగిటివ్ పాత్రలు పోషిస్తున్న మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ప‌రిశ్ర‌మ అగ్ర‌క‌థానాయిక‌ త్రిష కృష్ణన్‌పై అత్యంత వివాదాస్పద, అవమానకరమైన క్ష‌మార్హం కాని అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారు. ఆ త‌ర్వాత ఎపిసోడ్స్ గురించి తెలిసిన‌దే. ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌ల‌ తర్వాత మ‌న్సూర్ పై కేసు నమోదు అయింది. అయితే తన వ్యాఖ్యలకు మన్సూర్ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో త్రిషకు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత త్రిష‌ ఇప్పుడు ఈ క్షమాపణపై స్పందించింది.

ఇక త్రిష‌కు సారీ చెబుతూ మ‌న్సూర్ రాసిన లేఖ‌ మర్యాదపూర్వకంగా కనిపించింది. ఇప్పుడు త్రిష తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో అతని క్షమాపణపై స్పందిస్తూ ఎంతో జాలి త‌ల‌చారు. "తప్పు చేయడం మానవ స‌హ‌జం.. క్షమించడం దైవ ల‌క్ష‌ణం! అనే అర్థంలో న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. కేవ‌లం ఒకే లైన్ లో త్రిష ఎంతో హుందాగా స్పందించ‌డంపై అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌న్సూర్ అసభ్య‌క‌ర వ్యాఖ్య‌లు

ఎపిసోడ్ ఎపిసోడ్లుగా సాగిన ఈ వివాదం పూర్వాప‌రాల్లోకి వెళితే.. విలన్ పాత్రలతో పాపుల‌రైన మన్సూర్ అలీ ఖాన్ ఇటీవ‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లతో హెడ్ లైన్స్ లోకొచ్చారు. మ‌న్యూర్ ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు. "త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్‌రూమ్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. నేను చాలా సినిమాల్లో చాలా రేప్ సన్నివేశాలు చేశాను గ‌నుక‌ ఇది నాకు కొత్త కాదు. కానీ కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో ఈ కుర్రాళ్ళు త్రిషను సెట్స్‌లో కూడా నాకు చూపించలేదు" అని మ‌న్సూర్ వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెల‌రేగింది. చాలా మంది తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని ఈ విష‌యంలో త‌ప్పు ప‌ట్టారు. నిజానికి విలన్ మ‌న్సూర్‌కి పెద్ద అభిమానిని అని ప్ర‌క‌టించిన‌ లోకేష్ అతడికి LEO లో ఒక పాత్రను ఆఫర్ చేయ‌డాన్ని నెటిజ‌నులు త‌ప్పు ప‌ట్టారు.

అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల్ని ఖండించిన త్రిష‌

తన గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు `లియో` సహనటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై త్రిష తీవ్రంగా మండిపడ్డారు. ద‌ళ‌పతి విజయ్ న‌టించిన లియోలో త్రిష శక్తివంతమైన పాత్ర‌లో అద్భుత‌ నటనను క‌న‌బ‌రిచారు. అయితే త్రిష‌తో రేప్ సీన్ అవ‌కాశం రానందుకు క‌ల‌త చెందాన‌ని మ‌న్సూర్ అస‌భ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై X లో త్రిష వ్యాఖ్యానిస్తూ.."మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా అసహ్యంగా మాట్లాడిన వీడియో ఇటీవల నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది సెక్సిస్ట్ గ‌ర్వం. అగౌరవం, స్త్రీ ద్వేషం, అసహ్యకరమైన వ్య‌క్తిత్వం, ప్ర‌తిదీ చెడుగా అనిపిస్తోంది. అతడు ఇలాంటివి కోరుకుంటూనే ఉంటాడు. కానీ అతడిలాంటి దయనీయమైన‌ వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని. నా సినిమా కెరీర్‌లో ఎప్ప‌టికీ అలా జరగకుండా చూసుకుంటాను. అతనిలాంటి వ్యక్తులు మానవాళికి చెడ్డ పేరు తెస్తారు" అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. త్రిష పోస్ట్‌పై స్పందిస్తూ లోకేశ్ క‌న‌గ‌రాజ్ కూడా ఖాన్ చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.