Begin typing your search above and press return to search.

ఇన్నేళ్లకు నయనతారని క్రాస్ చేసే ఇమేజ్ తెచ్చుకున్న బ్యూటీ..!

కానీ చివర్లో ఆమెకు ట్విస్ట్ ఇస్తూ నయనతరా ప్లేస్ లో త్రిష ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. నయనతారకు చెక్ పెట్టే క్రమంలో త్రిష ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది.

By:  Tupaki Desk   |   18 Feb 2024 8:25 AM GMT
ఇన్నేళ్లకు నయనతారని క్రాస్ చేసే ఇమేజ్ తెచ్చుకున్న బ్యూటీ..!
X

కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్న నయనతార కొన్నేళ్లుగా అక్కడ టాప్ రేంజ్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కమర్షియల్ సినిమాలు.. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నయనతార కాదన్నాకే వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్లేవి. ఓ పక్క సోలో సినిమాలు చేస్తూనే తన దాకా వచ్చిన స్టార్ సినిమాలకు కూడా నయనతార ఓకే చెబుతూ కెరీర్ స్ట్రాంగ్ చేసుకుంది. ఆమె లీడ్ లో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందించడం తో నయనతార క్రేజ్ పెరుగుతూ వచ్చింది.

నయన్ డేట్స్ లేవంటే ఆమె ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్ చేద్దాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న నయనతార ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా తనని క్రాస్ చేసి వెళ్లడం అనేది జరగలేదనేలా చేసుకుంది. అయితే నయనతార పెళ్లి పిల్లలు వీటి వల్లో లేదా మరేమో గానే నయనతార గ్రాఫ్ చిన్నగా పడిపోతుంది.

అంతేకాదు ఆమె అనుకున్న ప్రాజెక్ట్ లకు మరో ఆప్షన్ గా త్రిష దగ్గరకు వెళ్తున్నాయి. రీసెంట్ గా ఒక భారీ సినిమాలో నయనతారని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ చివర్లో ఆమెకు ట్విస్ట్ ఇస్తూ నయనతరా ప్లేస్ లో త్రిష ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. నయనతారకు చెక్ పెట్టే క్రమంలో త్రిష ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది.

రెండు దశాబ్దాల కెరీర్ లో త్రిష కూడా ఈమధ్య సూపర్ ఫాం కొనసాగిస్తుంది. పి.ఎస్ 1 2 సినిమాలతో పాటుగా దళపతి విజయ్ లియో సినిమాల వల్ల ఆమెకు రేంజ్ పెరిగింది. తెలుగులో మెగాస్టార్ సరసన విశ్వంభర ఛాన్స్ కూడా అందుకుంది త్రిష. సో సినిమాల లెక్క చూసుకున్నా నయనతార కన్నా త్రిష దూకుడు చూపిస్తుందని చెప్పొచ్చు. లేడీ సూపర్ స్టార్ నయనతారని క్రాస్ చేసి త్రిష కోలీవుడ్ టాలీవుడ్ లో దూసుకెళ్లడం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది.

సినిమా రెమ్యునరేషన్ విషయంలో కూడ త్రిష టాప్ లేపేస్తుందని తెలుస్తుంది. మొన్నటిదాకా అమ్మడు 2, 3 కోట్లకు అటు ఇటుగా తీసుకోగా లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గాను లేటెస్ట్ గా ఒక సినిమాకు 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా నిర్మాతలు ఓకే చెప్పినట్టు టాక్. త్రిషకు అటు తమిళంలో ఇటు తెలుగులో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.