Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ తో రంగంలోకి అందాల బ్యూటీ!

తాజాగా శ‌నివారం అమ్మ‌డు ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టింది. ఆరంభ‌మే యాక్ష‌న్ తో ప్రారంభిం చింది. హీరోతో పాటు అమ్మ‌డు యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొంటుంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 6:57 AM GMT
యాక్ష‌న్ తో రంగంలోకి అందాల బ్యూటీ!
X

అందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటూ న‌వ నాయిక‌ల్ని మించి క్రేజీ ప్రాజెక్ట్ ల్లో న‌టిస్తోంది. 'పొన్నియ‌న్ సెల్వ‌న్' ప్రాంచైజీతో అమ్మ‌డి పేరు పాన్ ఇండియాలో మ‌రింత బ‌లంగా నాటుకుంది. దీంతో పాన్ ఇండియా ఛాన్సులు చేజిక్కించుకుంటుంది. ఈ నేప‌త్యంలో మాలీవుడ్ లో సైతం లాంచ్ అవుతుంది. ప్ర‌స్తుతం అక్క‌డ మాలీవుడ్ స్టార్ హీరో టివినో థామ‌స్ స‌ర‌స‌న 'ఐడెంటిటీ' అనే చిత్రంలో న‌టిస్తోంది.

తాజాగా శ‌నివారం అమ్మ‌డు ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టింది. ఆరంభ‌మే యాక్ష‌న్ తో ప్రారంభిం చింది. హీరోతో పాటు అమ్మ‌డు యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొంటుంది. దీంతో త్రిష రోల్ సినిమాలో యాక్ష‌న్ కి స్కోప్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌డం విశేషం. అఖిల్ పాల్- అనాస్ ఖాన్ లు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో త్రిష ఇంత‌వ‌ర‌కూ సినిమాలు చేసింది లేదు.

తెలుగు..త‌మిళ్ లో ఎన్నో సినిమాల్లో న‌టించింది. భిన్న‌మైన పాత్ర‌ల్లోనూ క‌నిపించింది. యాక్ష‌న్ చిత్రాల జోలికి మాత్రం ఇంత‌వ‌ర‌కూ వెళ్ల‌లేదు. తొలిసారి మాలీవుడ్ లో ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నం షురు చేస్తుంది. మ‌రి త్రిష యాక్ష‌న్ రోల్ ఎలా ఉంటుంద‌న్న‌ది? చూడాలి. టివినో థామ‌స్ మాలీవుడ్ లో పేరున్న హీరో. ఇటీవ‌లే '2018' వ‌ర‌ద బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఆ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించింది.

ఆ సినిమాతో టివినో థామ‌స్ కి ఇక్క‌డా మంచి గుర్తింపు ద‌క్కింది. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. మ‌రి తాజా ప్రాజెక్ట్ లో త్రిష కూడా భాగ‌మైన నేప‌థ్యంలో ఆ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో కూడా రిలీజ్ చేస్తారా? అన్న‌ది చూడాలి. అలాగే మాలీవుడ్ లో కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తోన్న' రామ్' అనే చిత్రంలోనూ త్రిష న‌టిస్తోంది.