Begin typing your search above and press return to search.

అతిధిగా అందాల న‌టి ఖాయ‌మేనా?

హీరోల‌తో త‌న‌కున్న స్నేహం కావొచ్చు..అమ్మ‌డి ట్యాలెంట్ కావొచ్చు. కార‌ణం ఏదైనా అంద‌రూ త్రిష కావాలంటున్నారు

By:  Tupaki Desk   |   15 March 2024 12:58 PM GMT
అతిధిగా అందాల న‌టి ఖాయ‌మేనా?
X

చెన్నై సోయ‌గం త్రిష కెరీర్ మ‌ళ్లీ స్పీడ‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. `పొన్నియ‌న్ సెల్వ‌న్` తో అమ్మ‌డు పాన్ ఇండియాలో మెరిసిన అనంత‌రం కొత్త అవ‌కాశాల జోరు పెరిగింది. ఇప్ప‌టికే చిరంజీవి..క‌మ‌ల్ హాస‌న్ లాంటి సీనియ‌ర్ స్టార్ల‌కు ఈ బ్యూటీనే ఎంపిక చేసారు. ఆ త‌ర్వాత త‌రం నటులు కూడా ఇదే అందంతో క‌లిసి న‌టించ‌డానికి అంతే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇదే అదునుగా అమ్మ‌డు మ‌ళ్లీ కోలీవుడ్.. టాలీవుడ్ చిత్రాల‌తో పుల్ బిజీ అవుతోంది. తెలివిగా అవ‌కాశాల్ని ఒడిసిప‌ట్టుకుంది.

హీరోల‌తో త‌న‌కున్న స్నేహం కావొచ్చు..అమ్మ‌డి ట్యాలెంట్ కావొచ్చు. కార‌ణం ఏదైనా అంద‌రూ త్రిష కావాలంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు మ‌రోసారి స్నేహితుడు త‌ల‌ప‌తి చిత్రంలో ఛాన్స్ అందుకుంది. ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఓ హీరోయిన్ గా మీనాక్షి చౌద‌రి న‌టిస్తోంది. తాజాగా ఇదే సినిమాలో త్రిష ఎంపికైంది.

అయితే హీరోయిన్ గా కాదు.. ఓ కీల‌క పాత్ర‌కు ఆమెని ఎంపిక చేసారు. అలాగే త్రిష‌తో ఓ స్పెష‌ల్ సాంగ్ సైతం చేయిస్తున్నారు. త్రిష పాత్ర ప‌రిచ‌యం..పాట అంతా స్టోరీలో భాగంగానే ఉంటుంది. అయితే ఆ త‌ర్వాత పాత్ర ముగింపు వ‌ర‌కూ ఉంటుందా? అక్క‌డితో ముగిస్తారా? అన్న‌ది స‌స్పెన్స్ . ఇప్ప‌టికే ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటుందిట‌. రెండు రోజుల షూట్ కూడా పూర్తిచేసింద‌ని స‌మాచారం.

అయితే త్రిష ఈ పాత్ర‌కి ఎంపిక అవ్వ‌డం వెనుక విజ‌య్ ఉన్నాడ‌ని అంటున్నారు. ఆ పాత్ర‌కు తొలుత వెంక‌ట్ ప్ర‌భు మ‌రో స్టార్ హీరోయిన్ ని అనుకున్నారుట‌. కానీ విజ‌య్ ...స్నేహితురాల్ని రిఫ‌ర్ చేయ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా ఎంపిక చేసిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. విజ‌య్ గ‌త సినిమా లియో లో త్రిష హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు ఆ కాంబినేష‌న్ లో కొన్ని సినిమాలొచ్చాయి.