Begin typing your search above and press return to search.

త్రిష.. ఈసారి ఏకంగా బడా ఆఫర్

సౌత్ ఇండియాలో హీరోయిన్ గా రెండు దశాబ్దాల కెరియర్ ని పూర్తి చేసుకున్న అందాల భామ త్రిష

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:43 AM GMT
త్రిష.. ఈసారి ఏకంగా బడా ఆఫర్
X

సౌత్ ఇండియాలో హీరోయిన్ గా రెండు దశాబ్దాల కెరియర్ ని పూర్తి చేసుకున్న అందాల భామ త్రిష. ఈ అమ్మడు కెరియర్ ఇక ముగిసిపోయింది అనుకున్న టైంలో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సిరీస్ పడింది. ఈ మూవీ సిరీస్ త్రిష ఇమేజ్ ని మరల అమాంతం పెంచేశాయి. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసేంతగా ఆమెకి రేంజ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం తమిళంలో అజిత్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ థగ్స్ లైఫ్ మూవీలో కూడా నటించే ఛాన్స్ అందుకుంది. మణిరత్నం దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభరలో కూడా త్రిషనే హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ ఎనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష హిందీలో కూడా అవకాశం సొంతం చేసుకుంది. 2010లో త్రిష హిందీలో అక్షయ్ కుమార్ కి జోడీగా కట్టా మీటా సినిమాలో నటించింది. ఆ తరువాత మళ్ళీ అవకాశాలు రాలేదు. 13 ఏళ్ళ తర్వాత హిందీలో మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఈ సారి ఏకంగా సల్మాన్ ఖాన్ కి నటించబోతోంది. తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ది బుల్ అనే మూవీ చేస్తున్నారు.

ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మాల్దీవుల తిరుగుబాటును ఆపడానికి 1988 ఆపరేషన్ కాక్టస్ నిర్వహించిన బ్రిగేడియర్ ఫరూక్ బుల్సారా నేతృత్వంలోని భారత పారాట్రూపర్స్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఫరూక్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. అతని భార్యగా త్రిష నటించనుంది.

ఈ పాత్రకి కథలో చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. శుక్రవారం మూవీ అఫీషియల్ గా లాంచ్ కానుంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయడానికి దర్శకుడు విష్ణువర్ధన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దర్శకుడు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా పంజా అనే మూవీ చేశారు.