Begin typing your search above and press return to search.

విశ్వంభర : త్రిష కి డబుల్ ధమాకా...?

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం హీరోయిన్ గా నటిస్తున్న త్రిష ను డబుల్‌ రోల్‌ లో చూడబోతున్నామట.

By:  Tupaki Desk   |   10 March 2024 7:15 AM GMT
విశ్వంభర : త్రిష కి డబుల్ ధమాకా...?
X

మెగాస్టార్‌ చిరంజీవి కాస్త గ్యాప్‌ తర్వాత మొదలు పెట్టిన చిత్రం 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తో సినిమాను రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే యూనిట్‌ సభ్యులు నిర్థారించారు. చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా అవ్వడం తో ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ప్రచారం జరుగుతోంది.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం హీరోయిన్ గా నటిస్తున్న త్రిష ను డబుల్‌ రోల్‌ లో చూడబోతున్నామట. ఆమె పాత్రకు కథ లో అత్యంత కీలకమైన ప్రాముఖ్యత ఉంటుందని కూడా సమాచారం అందుతోంది.

మొత్తానికి చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటించడం అంటేనే చాలా గొప్ప విషయం. అలాంటిది ముద్దుగుమ్మ త్రిష కి డబుల్ రోల్‌ చేసి ఎక్కువ సమయం స్క్రీన్‌ ప్రజెన్స్‌ దక్కించుకునే అవకాశం దక్కింది. అంటే ముద్దుగుమ్మ త్రిష కి డబుల్‌ ధమాకా అన్నట్లుగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాలో చిరంజీవి, త్రిష తో పాటు సురభి, రమ్య, ఇషా చావ్లా, అశ్రిత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.