Begin typing your search above and press return to search.

త్రిష డిమాండ్ అలా ఉంది మరి..!

రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ ఆడియన్స్ మనసు తెలుసుకుని వారిని అలరించే సినిమాలు చేస్తుంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 10:30 AM GMT
త్రిష డిమాండ్ అలా ఉంది మరి..!
X

రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ ఆడియన్స్ మనసు తెలుసుకుని వారిని అలరించే సినిమాలు చేస్తుంది. అమ్మడు ఎంట్రీ ఇచ్చిన టైం లో వచ్చిన చాలా మంది భామలను ఆడియన్స్ మర్చిపోయారు కూడా కానీ త్రిష ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో స్థానం కొనసాగుతూనే ఉంది. హీరోయిన్ అంటే సినిమాలు చేస్తున్న టైం లోనే కాదు గ్యాప్ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదే త్రిషకు కలిసి వచ్చింది. కెరీర్ లో కొన్నాళ్లుగా వెనకబడ్డ అమ్మడు ఆ టైం లో కూడా గ్లామర్ విషయంలో కేర్ తీసుకుంది.


అందుకే తిరిగి ఫాంలోకి వచ్చాక మరింత అందంగా కనిపిస్తుంది. ఈమధ్య త్రిష సినిమాల్లో లుక్స్ చూసి ఆమె నీ మనసు నాకు తెలుసు టైంలో ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అలానే ఉందని అనేస్తున్నారు. పి.ఎస్ 1, 2 సినిమాలతో పాటుగా దళపతి విజయ్ తో చేసిన లియో సినిమాలు త్రిష మైలేజ్ బాగా పెంచాయి. ఈ క్రేజ్ తోనే అమ్మడు టాలీవుడ్ లో కూడా ఛాన్స్ లు అందుకుంటుంది. అంతకుముందు ఒకటి రెండు అవకాశాలు వచ్చినా తెలుగులో చేయడానికి ఆసక్తి చూపించని త్రిష ఇప్పుడు చిరు 156వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో త్రిష యాడ్ అవ్వడం గ్లామర్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు త్రిష భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కోలీవుడ్ లో ఇప్పటికి కూడా సినిమాకు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్న త్రిష చిరు విశ్వంభర సినిమాకు మరో కోటి అదనంగా అడిగిందట.

ఆల్రెడీ చిరుతో స్టాలిన్ సినిమా చేసిన త్రిష రెండేళ్ల క్రితం వచ్చిన ఆచార్యలో నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్ గా విశ్వంభర సినిమాకు ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కోసం త్రిష 3 కోట్ల దాకా పారితోషికం తీసుకుందని టాక్. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష ఉంటే ఆ లెక్క వేరేలా ఉంటుందని మేకర్స్ ప్లాన్. అందుకే ఆమె అడిగినంత ఇచ్చి ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. విశ్వంభర హిట్ అయితే త్రిష తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని చూస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఒకటి రెండు ఆఫర్లు త్రిష దగ్గరకు వెళ్లాయని తెలుస్తుంది.