Begin typing your search above and press return to search.

త్రిష - మన్సూర్.. ఇప్పటికైనా ముగిసేనా?

లియో సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ విషయంలో మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై ఎలాంటి కామెంట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 7:20 AM GMT
త్రిష - మన్సూర్.. ఇప్పటికైనా ముగిసేనా?
X

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బాగా వైరల్ అయిన విషయాలలో త్రిష - మన్సూర్ అలీ ఖాన్ వివాదం ఒకటి. మొదట వీరి వివాదం కేవలం కోలీవుడ్ కే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత మెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏకంగా మన్సూర్ చిరంజీవిపై కూడా ఊహించిన విధంగా రియాక్ట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

లియో సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ విషయంలో మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై ఎలాంటి కామెంట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతను స్పందించిన విధానం ఒక్కసారిగా వివాదాన్ని రేకెత్తించింది. ఎలాంటి గౌరవం లేకుండా అలాంటి కామెంట్స్ చేయడంతో ఆ విషయంలో త్రిష కు చాలా మంది మద్దతు ఇచ్చారు

ఈ విధంగా రియాక్ట్ అవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని లియో దర్శకుడు లోకేష్ తో పాటు అలాగే మరి కొంతమంది హీరోయిన్స్ కూడా ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని స్పందించారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిపై స్పందించారు

అయితే ఈ విషయంలో మొదట మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పినట్లే చెప్పి ఆ తర్వాత మళ్లీ తనపై కావాలని కామెంట్ చేసిన వారి పై కేసులు వేస్తాను అన్నట్లుగా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చినట్లు అనిపించింది. తానేమీ తప్పు మాట్లాడలేదు అన్నట్లుగానే మొదట మన్సూర్ వ్యాఖ్యానించారు.

ఇక ఈ విషయంపై ముందే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక వెంటనే మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై విచారించారు. ఇక రాతపూర్వకంగా త్రిషకు ఒక లేఖ పంపుతూ వివరణ కోరారు. అయితే ఈ విషయంలో దర్శకుడు మన్సూర్ అలీ ఖాన్ పై త్రిష మరోసారి జాలి చూపించారు. అతను క్షమాపణ చెప్పాడు అని ఇకపై చర్యలు చేపట్టవద్దు అని అన్నట్లుగా ఆమె రియాక్ట్ అయినట్లుగా పోలీసులు వివరణ ఇచ్చారు. దీంతో ఈ విషయంకు మళ్ళీ ముగింపు కార్డు పడింది అనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మన్సూర్ అలీ ఖాన్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తాడా లేదంటే మరొక యాంగిల్ లో చర్చకు దారి తీస్తాడా.