స్టార్ హీరోయిన్ పెళ్లిపై పెరుగుతున్న ఆసక్తి
నాలుగు పదుల వయసులో కూడా సౌత్ లో తన సత్తా చాటుతూ బిజీగా ఉంది త్రిష. ఆమె క్యాజువల్ గా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
By: Tupaki Desk | 1 April 2025 12:50 PM ISTనాలుగు పదుల వయసులో కూడా సౌత్ లో తన సత్తా చాటుతూ బిజీగా ఉంది త్రిష. ఆమె క్యాజువల్ గా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. త్రిష షేర్ చేసిన ఫోటో నార్మల్ గా ఓ పార్టీలో దిగిన ఫోటో. ఆ ఫోటోలో రమ్యకృష్ణ, జ్యోతికతో పాటూ రాధికా శరత్‌కుమార్ లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. వారితో కలిసి నైట్ టైమ్ లో దిగిన ఫోటోను త్రిష తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలు చూస్తుంటే నార్మల్ గెట్ టు గెదర్ లా అనిపిస్తున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వాళ్లంతా బ్యాచిలర్ పార్టీ కోసమో లేదంటే పెళ్లి పార్టీ కోసమో కలిశారని సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. త్రిష పెళ్లి పై అందరికీ రోజురోజుకీ ఆసక్తి పెరుగుతుంది. అయితే త్రిష పర్సనల్ లైఫ్ గురించి, ఆమె పెళ్లి గురించి నెట్టింట వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు.
అభిమానులు చేసే హంగామాకు తగ్గట్టే త్రిష షేర్ చేసే పోస్టులు కూడా ఉంటాయి. గతంలో కొన్ని నెలల కిందట కూడా త్రిష పెళ్లికూతురు బట్టల్లో కనిపించి హడావిడి చేసింది. అప్పట్నుంచి ఆమె పెళ్లి వార్తలపై అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ అందుకుని సూపర్ ఫామ్ లోకి వచ్చిన త్రిషకు ఆ సినిమా తర్వాత ఆఫర్లు క్యూ కట్టాయి.
దీంతో ప్రస్తుతం త్రిష ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ టైమ్ లో త్రిష పెళ్లి చేసుకుని అటు సినీ లైఫ్ ను, ఇటు పర్సనల్ లైఫ్ ను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుందా లేక చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యాకే త్రిష పెళ్లి గురించి ఆలోచిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరతో పాటూ అజిత్ తో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హీరోగా వస్తోన్న థగ్ లైఫ్ లోనూ నటిస్తోంది.
సీనియర్ స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న త్రిషకు ఇప్పుడు పెళ్లి చేసుకునేంత తీరిక ఉందా అని ఓ వర్గం అభిమానులు ప్రశ్నిస్తుండగా ఉన్నట్టుండి త్రిష ఏమైనా సర్‌ప్రైజ్ ఇస్తుందేమోనని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో త్రిష ఏం ఆలోచిస్తుందో చూడాలి మరి.
