ఇంతకి ప్రేమేనా.. పీఆర్ స్టంటా?
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయిన త్రిష.. ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్‌ను కొనసాగిస్తూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు.
By: Tupaki Desk | 25 Jun 2025 12:22 PM ISTతమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయిన త్రిష.. ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్‌ను కొనసాగిస్తూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో ఉన్నప్పటికీ ఆమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా త్రిష విజయ్ మధ్య ఉన్న అనుబంధంపై తరచూ వార్తలు చక్కర్లు కొడుతుండటం తెలిసిందే.
ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఒకే సోఫాలో త్రిషతో విజయ్ క్లోజ్‌గా కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే కాదు, ఆ ఫొటోలో విజయ్ త్రిష పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందన్న ప్రచారం మళ్లీ మొదలైంది.
ఈ పోస్టు తర్వాత మరో సందేశాన్ని కూడా త్రిష షేర్ చేశారు. తనపై అపోహలు, విమర్శలు ఉన్నవారిపై కాస్త సెటైరిక్‌గా ఆ సందేశాన్ని పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో నిజంగా త్రిష విజయ్ మధ్య ఎలాంటి సంబంధముందోనన్న చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ఫోటో త్రిష ఇంట్లో తీసినదని, వ్యక్తిగత సమయాన్ని కలిసి గడుపుతున్నారని కొంతమంది నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
ఇంతవరకు త్రిష విజయ్ ఇద్దరూ ఈ గాసిప్స్ పై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఇటీవలి పోస్టులు చూసినవారంతా వీరిద్దరి మధ్య కచ్చితంగా ఏదో ఉందని భావిస్తున్నారు. ఒక దశలో వారిద్దరి మధ్య ప్రేమలోనూ ఉన్నారని, విడిపోయిన తర్వాత మళ్లీ కలిశారని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఇదే చర్చ రీ ఎంట్రీ ఇచ్చినట్లైంది.
ఇక సినిమా విషయానికి వస్తే.. త్రిష ఇటీవలే థగ్ లైఫ్ చిత్రంలో నటించారు. విజయ్ నటిస్తున్న జననాయకుడు సినిమాలో కూడా ఆమె ఒక స్పెషల్ పాటలో కనిపించినట్టు వార్తలు ఉన్నాయి. 43 ఏళ్ల వయసులోనూ త్రిష తన గ్లామర్‌తో యువ కథానాయికలకు పోటీగా నిలుస్తున్నారు. అయితే ఈ సందర్భాన్ని త్రిష ఉద్దేశపూర్వకంగా గాసిప్‌లను మెయింటేన్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారా లేక నిజంగా ఆమె వ్యక్తిగత జీవితం మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నదా అనే సందేహాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
