Begin typing your search above and press return to search.

విజయ్ బర్త్ డే.. త్రిష పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్!

అదే సమయంలో స్టార్ హీరోయిన్ త్రిష పోస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అంటూ ఆమె పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 12:48 PM IST
విజయ్ బర్త్ డే.. త్రిష పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్!
X

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నిన్న బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రియులు, అభిమానులు, సెలబ్రిటీలు విషెస్ తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టులు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఆయన నటిస్తున్న జ‌ననాయ‌కుడు మూవీ నుంచి మేకర్స్ అప్డేట్స్ ఇచ్చారు. ఫ‌స్ట్ రోర్‌ గ్లింప్స్‌ ను విడుదల చేశారు.


టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్‌. వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై గ్లింప్స్ తో ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ కు గ్లింప్స్ మంచి ఫీస్ట్ గా మారింది. ప్రస్తుతం అది నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. అదే సమయంలో స్టార్ హీరోయిన్ త్రిష పోస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అంటూ ఆమె పోస్ట్ చేశారు.

త్రిష ఫోటో షేర్ చేయగా.. అందులో ఒకే సోఫాలో ఆమెతో పాటు విజయ్ చాలా క్లోజ్ గా కూర్చుని కనిపిస్తున్నారు. త్రిష పెంపుడు కుక్క పిల్లను విజయ్ ఆడిస్తూ కూడా కనిపించారు. దీంతో ఆ పిక్ కాస్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు, విజయ్- త్రిష అభిమానులు రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు.

ఆ ఫోటో త్రిష ఇంట్లోనే దిగినట్లు ఉందని కొందరు నెటిజన్లు అనుమానిస్తున్నారు. డేటింగ్ లో ఉన్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఏడాది క్రితం విజయ్, త్రిష రిలేషన్ గురించి జోరుగా చర్చ సాగింది. తర్వాత కొన్ని రోజులకు సైలెంట్ అయింది. మళ్లీ ఇప్పుడు త్రిష పోస్ట్ చేసిన పిక్ తో మళ్లీ డిస్కస్ చేసుకుంటున్నారు. డేటింగ్ లో ఉన్నట్టు ఉన్నారని చెబుతున్నారు.

అదే సమయంలో త్రిష, విజయ్ ఫ్యాన్స్.. రూమర్స్ ను కొట్టిపారేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అని పెట్టారుగా.. ఫ్రెండ్స్ అయ్యి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని చెబుతున్నారు. బర్త్ డే కోసం పెట్టిన పోస్ట్ కు ఇంత చర్చ అవసరమా అని అంటున్నారు. మరి దీనిపై ఇద్దరిలో విజయ్, త్రిష స్పందిస్తారేమో చూడాలి.

అయితే ఇప్పటికే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో విజయ్, త్రిష కలిసి నటించారు. అదే సమయంలో త్రిష.. సెకెండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా థగ్‌ లైఫ్‌ తో పలకరించిన అమ్మడు.. ప్రస్తుతం విశ్వంభర సహా మరికొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. 43 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్‌ తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి.