పిక్ టాక్ : అందాల సీతాకోక చిలుక
హీరోలతో పోల్చితే హీరోయిన్స్ కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఆరు పదుల వయసులోనూ హీరోలు మూడు పదుల వయసు పాత్రల్లో నటిస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 20 May 2025 3:23 PM ISTహీరోలతో పోల్చితే హీరోయిన్స్ కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఆరు పదుల వయసులోనూ హీరోలు మూడు పదుల వయసు పాత్రల్లో నటిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ మాత్రం అలా కాదు. వారి వయసు పెరుగుతున్నా కొద్ది ఆఫర్లు తగ్గుతూ ఉంటాయి. సాధారణంగా హీరోయిన్స్ పది నుంచి పదిహేను ఏళ్ళు ఇండస్ట్రీలో కొనసాగగలరు. అంతకు మించి ఎక్కువ కాలం హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా అరుదైన వారు. అలాంటి అరుదైన హీరోయిన్స్ సౌత్ ఇండియాలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో స్టార్ హీరోయిన్ త్రిష ఒకరు అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో ఆమె అడుగు పెట్టి పాతిక ఏళ్లు అవుతోంది.
త్రిష 1999లో జోడీ సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టకున్నా, హీరోయిన్‌గా తమిళ సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకుంది. ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలోనే ఏడాదిలో అర డజను సినిమాలు చేయడంతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా టాప్ స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రిష ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన విషయం తెల్సిందే. రెండు జనరేషన్స్ హీరోలతో నటించింది.
ప్రస్తుతం ఈమె కమల్ హాసన్‌తో కలిసి నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటుంది. ఆ సమయంలోనే ఇలా సీతాకోక చిలుకల డిజైన్‌తో మంచి ఔట్ ఫిట్ ధరించింది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పాతిక ఏళ్లు అవుతున్న నేపథ్యంలో త్రిష వయసు ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కూడా ఇంకా రెండు పదుల వయసులో ఉన్నట్లుగానే ఈ ఔట్ ఫిట్‌లో చాలా అందంగా, కలర్ ఫుల్ సీతాకోక చిలు మాదిరిగా ఉంది అంటూ నెటిజన్స్ నుంచి కామెంట్స్ దక్కించుకుంది. అందమైన సీతాకోక చిలుక మరిన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో వెలుగు వెలగాలని అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా కోరుకుంటున్నారు.
వయసు పెరుగుతున్నా కొద్ది త్రిష చాలా అందంగా కనిపిస్తుందని అభిమానులు అంటూ ఉంటారు. ఈ ఫోటోలను చూస్తే నిజమే అనిపిస్తోందని కొందరు అంటున్నారు. ఇంత అందంగా ఉంది కనుక ముద్దుగుమ్మ త్రిషకి రెగ్యులర్‌గా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విశ్వరూపం, సూర్య45, రామ్ అనే మలయాళ సినిమాలోనూ నటిస్తోంది. చిరంజీవి విశ్వరూపం సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి త్రిష బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇంతకు ముందు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ వచ్చిన త్రిష ఈమధ్య కాలంలో స్పీడ్‌గా, ఎక్కువ సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సినీ విశ్లేషకులు మాట్లాడుతున్నారు.
