Begin typing your search above and press return to search.

అసలు మీరు ఎలా జీవిస్తున్నారు?: త్రిష స్ట్రాంగ్ కౌంటర్

అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్‌ నుంచి ఎదురైన నెగటివ్ కామెంట్లకు అమ్మడు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   11 April 2025 4:16 PM IST
అసలు మీరు ఎలా జీవిస్తున్నారు?: త్రిష స్ట్రాంగ్ కౌంటర్
X

టాలీవుడ్, కోలీవుడ్‌లో సమానంగా ఆదరణ పొందిన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. ఇక ఇటీవల ఆమె నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ విడుదలైంది. నాలుగు పదుల వయసులో కూడా ఆమె చెక్కుచెదరని అందంతో నేటితరం కుర్ర హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తోంది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంభందం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్‌ నుంచి ఎదురైన నెగటివ్ కామెంట్లకు అమ్మడు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.


లేటెస్ట్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో త్రిష కేవలం నెగటివ్ రివ్యూలనే కాదు, వ్యక్తిగత దూషణలు చేసే వారుపై కూడా తనదైన శైలిలో స్పందించింది. "షబాష్... మీరు ఎలా జీవిస్తున్నారు? సరిగా నిద్ర పడుతుందా? ఇతరుల గురించి అర్ధం లేని కామెంట్లు పోస్టు చేయడం వల్ల నిజంగా రోజంతా మీకు సంతృప్తిగా ఉంటుంది అనుకుంటున్నారా?" అంటూ ట్రోల్స్‌పై ప్రశ్నలు గుప్పించింది.

అంతేకాకుండా "మీ గురించి కాదు... మీ చుట్టూ ఉన్నవాళ్ల గురించి కూడా బాధగా ఉంది" అంటూ ఆమె ఎమోషనల్‌గా స్పందించింది. త్రిష ఈ మాటలు చెప్పడానికి కారణం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఆమె పాత్రపై సోషల్ మీడియాలో వచ్చిన మిశ్రమ స్పందనలు. కొన్ని సమీక్షల్లో ఆమె నటనపై ప్రశంసలు వచ్చినా, కొంతమంది మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని కామెంట్లు చేశారు. వాటిలో కొన్ని ట్రోలింగ్ స్థాయికి దిగజారడంతో త్రిష ఇలా స్పందించాల్సి వచ్చింది.

త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లకు పైనే అయ్యింది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె నెగిటివ్ కామెంట్స్ ను కూడా చాలానే చూసింది. కానీ ఈ రేంజ్ లో ఎప్పుడు రియాక్ట్ కాలేదు. కాబట్టి అమ్మడు గతంలో వచ్చిన కామెంట్స్ కు అలాగే ఇప్పుడు వస్తున్న ట్రోల్స్ పట్ల ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో ట్రోల్స్ మితిమీరిన విధంగా ఉంటున్నాయని ఆమె చెప్పకనే చెప్పేసింది.

ఇక సినిమా విషయానికొస్తే, అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలైన తొలి రోజే భారత్‌లో దాదాపు ₹29.35 కోట్లు వసూలు చేసింది. అజిత్ అభిమానులు సినిమా మీద మంచి రెస్పాన్స్ ఇస్తుండగా, త్రిష పాత్రకు కూడా ఒక వర్గం ప్రేక్షకులు మద్దతు తెలుపుతున్నారు. ఈ సినిమాకి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, జి.వి. ప్రకాష్ సంగీతాన్ని అందించారు. మొత్తానికి ట్రిషా కేవలం తన పాత్రపై విమర్శలతోనే కాదు, వ్యక్తిగత దూషణల మీద గట్టి రిప్లై ఇచ్చింది. మరి ఆమె చేసిన కామెంట్స్ వలన, ట్రోలింగ్‌కు ఎంతవరకు బ్రేక్ పడుతుందో చూడాలి.