చెన్నై బ్యూటీ నాట్ ఇంట్రెస్టెడ్..!
త్రిషకు ఈమధ్యనే ఒక స్టార్ హీరో సినిమా ఆఫర్ వచ్చిందట. ఐతే ఆ ఆఫర్ ని మాత్రం త్రిష కాదనేసిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 5 April 2025 8:15 AM ISTరెండు దశాబ్దాల కెరీర్ లో తన సినిమాలతో అదరగొట్టిన చెన్నై చిన్నది త్రిష ఇప్పటికీ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో త్రిష ఇప్పటికీ స్టార్ మేనియా కొనసాగిస్తుంది. మధ్యలో కెరీర్ కాస్త డ్రాప్ అయినా కూడా మళ్లీ ఊపందుకుంది. ఐతే త్రిషకు తెలుగులో కూడా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ కూడా స్టార్స్ తో అమ్మడు నటించింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జత కట్టిన త్రిష కొన్నాళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం అమ్మడు మళ్లీ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాతో వస్తుంది. ఈ సినిమాలో త్రిష లుక్స్ ఇంకా ఆమె పాత్ర ఇంప్రెస్ చేస్తుందని తెలుస్తుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త్రిష తెలుగులో చేస్తున్న సినిమా కాబట్టి విశ్వంభర మీద మంచి బజ్ ఏర్పడింది. ఐతే తెలుగులో చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్న త్రిషకు ఇక్కడ వరుస ఆఫర్లు వస్తున్నాయట.
త్రిషకు ఈమధ్యనే ఒక స్టార్ హీరో సినిమా ఆఫర్ వచ్చిందట. ఐతే ఆ ఆఫర్ ని మాత్రం త్రిష కాదనేసిందని తెలుస్తుంది. కారణాలు ఏంటన్నది తెలియదు కానీ త్రిష ఆ బిగ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఐతే డేట్స్ క్లాష్ వల్లే త్రిష తెలుగు సినిమా ఆఫర్ కాదన్నది అని అంటున్నా దానికి రీజన్స్ వేరే ఉన్నాయని అంటున్నారు. తమిళ్ లో ఇప్పటికీ తన స్టార్ మేనియా కొనసాగిస్తున్న త్రిష తెలుగు నుంచి తక్కువ అవకాశాలే వస్తున్నాయి.
విశ్వంభర పూర్తి కాగానే త్రిషకు ఇక్కడ నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ వచ్చేలా ఉన్నాయి. ఐతే ఇదివరకులా టాలీవుడ్ సినిమాల మీద త్రిష అంత ఆసక్తి చూపించట్లేదని టాక్. కమర్షియల్ సినిమాలు కాకుండా తన సీనియారిటీకి తగినట్టుగా కాస్త కథా బలం ఉన్న సినిమాలు ఇంకా కుదిరితే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని చూస్తుంది త్రిష. అందుకే టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా అవకాశాలను కాదంటుందని తెలుస్తుంది. త్రిషని వరుస తెలుగు సినిమాల్లో చూడాలని ఇక్కడ ఫ్యాన్స్ ఆశిస్తున్నా అమ్మడు మాత్రం నో ఛాన్స్ అనేస్తుంది. మరి విశ్వంభర తర్వాత త్రిషని మెప్పించే కథ ఏది అవుతుంది అన్నది చూడాలి.
