టాలీవుడ్ లో త్రిష లైనప్ ఇంట్రెస్టింగ్!
అందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. 'పొన్నియన్ సెల్వన్' నుంచి అమ్మడు ఫాం కొనసాగిస్తుంది.
By: Tupaki Desk | 16 April 2025 9:00 PM ISTఅందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. 'పొన్నియన్ సెల్వన్' నుంచి అమ్మడు ఫాం కొనసాగిస్తుంది. వరుసగా తల అజిత్ కు జోడీగా నటించి మురిపిస్తుంది. 'విదాముయార్చీ' ఫెయిలైనా ఆ లెక్కను 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విజయంతో సరి చేసింది. ప్రస్తుతం కమల్ హాసన్ కు జోడీగా 'థగ్ లైఫ్' లో నటిస్తోంది. సూర్య 45వ చిత్రంలోనూ నటిస్తోంది. వీటితో పాటు టాలీవుడ్ లోనూ జోరు చూపిస్తోంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'విశ్వంభర'లో నటిస్తోంది. దీంతో పాటు తాజాగా మరో రెండు తెలుగు చిత్రాల్లో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా చిత్రం ఎస్ ఎస్ ఎంబీ 29లోనే ఛాన్స్ అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఓ హీరోయిన్ గా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఎంపికైంది. తాజాగా ఇదే సినిమాలో ఓ కీలక పాత్రకు త్రిషను తీసుకున్నట్లు వినిపిస్తోంది.
మహేష్ తో ఇప్పటికే అమ్మడు 'అతడు', 'సైనికుడు' చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంలోనూ షురూ అయితే హ్యాట్రిక్ నమోదవుతుంది. అలాగే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ ఈ భామనే హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రచారమంతా నిజమైతే త్రిష మళ్లీ జెట్ స్పీడ్ ను అందుకున్నట్లే. అటు మాలీవుడ్ లోనూ త్రిష దూకుడు కొనసాగుతుంది.
'హే జ్యూడ్' తర్వాత ఇటీవల రిలీజ్ అయిన 'ఐడెంటిటీ' చిత్రంతో మంచి విజయం అందుకుంది. ఇందులో ముస్లీమ్ యువతి పాత్రలో అమ్మడు మెప్పించింది. ప్రస్తుతం కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న `రామ్` చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికీ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవి గాక కొన్ని కొత్త చిత్రాల కథలు విన్నట్లు సమాచారం.
