పెంపుడు కుక్కకు త్రిష ఏం నేర్పిస్తోందో చూశారా?
మూగ జీవాలను ప్రేమగా చూడలేకపోయినా.. కనీసం వాటికి జీవించేందుకు అవకాశం అయినా ఇవ్వాలి.
By: Tupaki Desk | 28 March 2025 9:42 PM ISTమూగ జీవాలను ప్రేమగా చూడలేకపోయినా.. కనీసం వాటికి జీవించేందుకు అవకాశం అయినా ఇవ్వాలి. ఇది మానవధర్మం. రోడ్ పై యాక్సిడెంట్ తో గాయపడిన కుక్క పిల్లనో లేదా ఏదైనా మూగ జీవాన్ని చూసినప్పుడు బాధ్యతారాహిత్యంగా దానిని అలానే వదిలేసి ఏమీ చూడనట్టు వెళ్లిపోయే పెద్ద మనుషులకు భిన్నంగా ఒక్క క్షణం ఆలోచించినా అది మానవత్వం.
నడి రోడ్ పై యాక్సిడెంట్ కి గురైన ఓ వీధి కుక్కను చూస్తూ వెళ్లిపోయే ప్రజలకు భిన్నంగా ఆలోచించిన త్రిష ఓసారి ఓ వీధికుక్కను తనతో పాటే కార్ లో తీసుకుని వెళ్లి, దానికి చికిత్స అందించి సాకింది. అప్పటి నుంచి త్రిష పెటా బ్రాండ్ అంబాసిడర్ గా మూగ జీవాల పాలిట దేవత అయింది. చాలా సందర్భాలలో మూగ జీవాలను మనుషులు హింసించకుండా ఆపేందుకు తన వంతు ప్రయత్నం చేసిన త్రిష మంచి మనసు ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచాయి.
త్రిష ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో క్లిప్ లో ఫిట్‌నెస్, అంకితభావం - జంతువులపై దయా గుణం, ప్రేమ ప్రతిదీ చర్చగా మారింది. ఈ క్లిప్ లో తన పెంపుడు జంతువును పట్టుకుని స్క్వాట్స్ చేస్తూ కనిపించింది త్రిష. ఫిట్‌నెస్ కోసం తన రెగ్యులర్ సెషన్స్ కు హాజరైన త్రిష తనతో పాటే తన పప్పీని కూడా తీసుకుని వెళ్లడమే గాక.. దానితో ఇలా స్క్వాట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారింది. చాలా మంది అభిమానులు త్రిష కు మూగ ప్రాణులపై ఉండే ప్రేమ ముచ్చటగొలిపింది. తాను మాత్రమే కాదు తన పెట్ కూడా తనలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే మంచి మనసు త్రిషకు ఉందని ప్రశంసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం త్రిష తన ప్రియమైన పెంపుడు కుక్క సోరో మరణించినప్పుడు సొంత కుటుంబీకుడిని కోల్పోయినంతగా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె భావోద్వేగ నివాళి అనేక హృదయాలను గెలుచుకుంది. ఇంతలోనే ఇప్పుడు మరో పెట్ డాగ్ తో ఎంతో ప్రేమగా కనిపించింది త్రిష.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తళా అజిత్ తో విదాముయార్చి (తెలుగులో పట్టుదల) ఇటీవలే విడుదలై, ఆశించిన విజయం సాధించకపోవడం నిరాశపరిచింది. తదుపరి కమల్ హాసన్ థగ్ లైఫ్, చిరంజీవి `విశ్వంభర`లోను త్రిష కనిపించనుంది. ఈ రెండూ తన కెరీర్ లో కీలకమైన సినిమాలు. వీటిపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు విజయ్ సేతుపతితో కలిసి తన బ్లాక్ బస్టర్ సినిమా 96 కి సీక్వెల్ లోను నటిస్తుందని కథనాలొస్తున్నాయి. అయితే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
