Begin typing your search above and press return to search.

25 ఏళ్ల‌లో స్టార్ హీరోయిన్ ఆర్జ‌న షాకిస్తోందే!

ఆ త‌ర్వాత కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. నిన్న మొన్న‌టి `పొన్నియ‌న్ సెల్వ‌న్` ఫ్రాంఛైజీ సినిమాల వ‌ర‌కూ త్రిష అజేయ‌మైన ప్ర‌యాణాన్ని సాగించింది.

By:  Tupaki Desk   |   1 May 2025 9:30 AM IST
Trisha’s Journey to Becoming a South Indian Icon
X

తెలుగు, త‌మిళంలో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతున్న త్రిష త‌న రెండున్న‌ర‌ ద‌శాబ్ధాల కెరీర్ లో ఏ మేర‌కు ఆస్తుల్ని సంపాదించింది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే... జాతీయ మీడియా వివ‌రాల ప్ర‌కారం.. త్రిష రూ.90 కోట్ల ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టింద‌ని స‌మాచారం. 1999లో `జోడి` అనే చిత్రంతో న‌టిగా ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన త్రిషకు టాలీవుడ్ గొప్ప గుర్తింపును ఇచ్చింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న వ‌ర్షం త్రిష కెరీర్ గేమ్ ఛేంజ‌ర్. ఆ త‌ర్వాత కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. నిన్న మొన్న‌టి `పొన్నియ‌న్ సెల్వ‌న్` ఫ్రాంఛైజీ సినిమాల వ‌ర‌కూ త్రిష అజేయ‌మైన ప్ర‌యాణాన్ని సాగించింది.

త్రిష‌ ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటోంది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఏడాది కాంట్రాక్ట్ కోసం రూ.9 కోట్లకు పైగా సంపాదిస్తుంది. `పొన్నియిన్ సెల్వన్: 1` విజయం తర్వాత `లియో` కోసం రూ.5 కోట్లకు పారితోషికాన్ని పెంచింద‌ని క‌థ‌నాలొచ్చాయి. త్రిష‌కు ప‌లు న‌గ‌రాల్లో ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్ లో 6 కోట్ల ఖ‌రీదు చేసే ఇల్లు, చెన్నైలో 10 కోట్ల విలువ చేసే విలాస‌వంత‌మైన ఇల్లు ఉన్నాయి. త్రిష కార్ల గ్యారేజీలో కోట్లాది రూపాయ‌ల విలువ చేసే ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. రూ.63 లక్షల నుండి రూ.80 లక్షల రేంజులో ప‌లు బ్రాండెడ్ కార్ల‌ను కొనుగోలు చేసింది. మ‌రో రెండు మూడేళ్ల‌లో పెరుగుతున్న ధ‌ర‌లు, మార్కెట్ విలువ దృష్ట్యా త్రిష 100 కోట్ల నిక‌ర ఆస్తుల క్ల‌బ్ లో చేరుతుంద‌ని అంచ‌నా.

త్రిష చివరిసారిగా అజిత్ చిత్రం `విదాముయార్చి`లో కనిపించింది. ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేదు. త‌దుప‌రి మెగాస్టార్ `విశ్వంభ‌ర‌`లో న‌టిస్తోంది. ప‌లువురు సీనియ‌ర్ హీరోల‌కు త్రిష బెస్ట్ ఆప్ష‌న్ గా ఉంది. 41 ఏజ్‌లోను నేటిత‌రం క‌థానాయిక‌ల‌తో పోటీప‌డుతూ త్రిష కెరీర్ జ‌ర్నీని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తోంది.