Begin typing your search above and press return to search.

త్రిష సినిమాలు.. ఏకంగా డబుల్ అయిందా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష మరోసారి చర్చనీయాంశంగా మారారు.

By:  M Prashanth   |   15 Jun 2026 1:00 AM IST
త్రిష సినిమాలు.. ఏకంగా డబుల్ అయిందా?
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష మరోసారి చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారాయి. వరుస విజయాలతో కెరీర్ లో మరోసారి స్ట్రాంగ్ ఫేజ్ కు చేరుకున్న త్రిష, కొత్త ప్రాజెక్టుల విషయంలో తన డిమాండ్‌ పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.

త్రిష కెరీర్‌ ను పరిశీలిస్తే, హిట్లు-ఫ్లాపులు ఉన్నాయి. అయితే ప్రతిసారి చిన్న బ్రేక్ తర్వాత ఆమె మళ్లీ స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇచ్చి టాప్ ప్లేస్ లో నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కొన్ని చిత్రాలు అనుకున్న రేంజ్ లో విజయాన్ని అందుకోకపోయినా, తాజా విజయంతో ఆమె మార్కెట్‌ మళ్లీ ఫుల్ గా పెరిగిందని టాక్ వినిపిస్తోంది. త్రిషకు గోల్డెన్‌ ఫేజ్‌ నడుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు వరుసగా రావడం, పాన్‌ ఇండియా రేంజ్ లో ఆమెకు గుర్తింపు ఉండటం, ప్రేక్షకుల్లో ఇప్పటికీ మంచి రెస్పాన్స్ కొనసాగడం ఇందుకు కారణాలుగా చెప్పాలి. యంగ్ హీరోయిన్లు నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, ఎక్స్పీరియన్స్, యాక్టింగ్, సిల్వర్ స్క్రీన్ పై ఆకర్షణతో ఆమె తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.

ఇటీవల భారీ చిత్రం విజయంతో త్రిష క్రేజ్‌ మరింత పెరిగిందని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు కొత్త ప్రాజెక్టుల ఆఫర్లు పెరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందే చిత్రాల కోసం నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో త్రిష పారితోషికాన్ని డబుల్ చేసినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

రీసెంట్ గా ఒక బై లాంగ్వేజ్ మూవీ కోసం ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. నిర్మాతలు, మూవీ టీమ్స్ లేదా త్రిష తరఫున ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇండస్ట్రీలో విజయాల ఆధారంగా పారితోషికాలు మారడం కొత్త విషయం కాదు. ఒక సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయితే క్యాస్టింగ్ మార్కెట్‌ వాల్యూ పెరగడం సహజం.

ప్రస్తుతం త్రిష విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఆమె పేరు ప్రాజెక్టుకు ఎక్స్ ట్రా ఆకర్షణగా మారుతుండటంతో నిర్మాతలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు త్రిష చేతిలో ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. దీంతో త్రిష కెరీర్‌ మరోసారి బెస్ట్ రేంజ్ కు చేరుకుందని అభిమానులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న పారితోషికం వార్తల్లో ఎంత నిజం ఉందన్నది మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. త్రిషకు ఇప్పటికీ తగ్గని క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ ను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో కూడా త్రిష సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది