సౌత్ క్వీన్ త్రిష సరికొత్త రికార్డు!
తమిళ చిత్రసీమలోని ముగ్గురు అగ్ర హీరోల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో కథానాయికగా నటించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
By: Srikanth Kontham | 25 May 2026 6:00 AM ISTదక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా హవా కొనసాగిస్తున్న నటి త్రిష . మారుతున్న కాలంతో పాటు ఎంతోమంది కొత్త కథానాయికలు దిగుమతి అవుతున్నా? త్రిష క్రేజ్ మాత్రం అంతకంతకు రెట్టింపు అవుతుంది. అందం సైతం వయసుతో పెరుగుతూనే ఉంది. తాజాగా కోలీవుడ్ పరిశ్రమలో అమ్మడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తమిళ చిత్రసీమలోని ముగ్గురు అగ్ర హీరోల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో కథానాయికగా నటించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
దళపతి విజయ్ సరసన త్రిష కెరీర్ ఆరంభం నుండి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `లియో` చిత్రం విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ భార్యగా త్రిష పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. విజయ్ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన బ్లాక్‌బస్టర్ సినిమాలో త్రిష భాగం కావడం అమ్మడి కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో కూడా త్రిషకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.
అజిత్ సరసన నటించిన `గుడ్ బాడ్ అగ్లీ` మంచి విజయం సాధించింది. అంతకు ముందు `ఎంతవాడు గానీ` చిత్రంలో భార్యపాత్రలో నటించి పర్పెక్ట్ నాయికగా సత్తా చాటింది. అలాగే వర్సటైల్ యాక్టర్ సూర్య సరసన కూడా త్రిష నటించిన గత చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన`కరుప్పు` కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మార్కెట్ పరిధిని పెంచే ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో త్రిష హీరోయిన్‌గా నటించడంతో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్పష్టమవుతోంది.
ఈ ముగ్గురు అగ్ర నటుల బిగ్గెస్ట్ గ్రాసర్స్ - మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలలో త్రిష కథానాయికగా నటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు టాప్ లీగ్‌లో కొనసాగుతూ జనరేషన్ మారుతున్నా ?నేటికీ భారీ ప్రాజెక్టులకు ఛాయిస్‌గా నిలవడం అనేది సాధారణ విషయం కాదు. త్రిష సినిమాల ఎంపిక, సీనియర్ హీరోలతో ఉన్న సక్సెస్ రేట్ సౌత్ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా నిలబెట్టాయన్నది కాదనలేని నిజం. ఈ అరుదైన విజయాలను అభిమానులు - సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక హీరోయిన్ కెరీర్‌లో ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోల అత్యధిక వసూళ్ల చిత్రాలలో భాగం కావడం అనేది లక్కీ చార్మ్‌గా మాత్రమే కాదు. ఆమెకున్న స్టార్ పవర్ - డిమాండ్‌కు అద్దం పడుతోంది. దీంతో త్రిష సైన్ చేసిన తాజా ప్రాజెక్ట్ లపై ఆసక్తి నెలకొంది.
