విశ్వంభరలో త్రిష లుక్ వైరల్.. విజువల్ వండర్‌లో ఎమోషనల్ కోర్ ఆమెదేనా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎపిక్ విశ్వంభర నుంచి వచ్చిన తాజా అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Tupaki Desk | 4 May 2026 12:59 PM ISTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎపిక్ విశ్వంభర నుంచి వచ్చిన తాజా అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్రిష కృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ కేవలం విజువల్‌గా మాత్రమే కాకుండా కథపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. ట్రెడిషనల్ లుక్‌లో డివైన్ ఔరాతో కనిపించిన త్రిష, ఈసారి కేవలం గ్లామర్ రోల్‌కే పరిమితం కావడం లేదని క్లియర్ సంకేతాలు ఇస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష పోషించిన అవని క్యారెక్టర్ కథలో కీలక మలుపులు తీసుకొచ్చే కోర్ ఎలిమెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది. అంటే, ఈ సినిమా నెరేషన్ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇదే పాయింట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన బలంగా మారుతోంది. ఇప్పటివరకు త్రిష చేసిన పాత్రలతో పోలిస్తే అవని పాత్రలో ఎక్కువ డెప్త్, ఎమోషనల్ వెయిట్ ఉండబోతుందని సమాచారం. కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, కథను ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్‌గా ఆమె పాత్ర ఉండనుండటంతో, ఇది ఆమె కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్న చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా సెలెక్టివ్ ప్రాజెక్ట్స్‌తో ముందుకు సాగుతున్న త్రిషకు ఈ సినిమా స్ట్రాంగ్ కంబ్యాక్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో రీచ్ ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో పవర్‌ఫుల్ రోల్ దక్కడం, ఆమెను మళ్లీ టాప్ లీగ్‌లో నిలబెట్టే ఛాన్స్‌గా ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, చిరంజీవి- త్రిష కాంబినేషన్ కూడా ఈ సినిమాకు మరో ముఖ్యమైన హైలైట్‌గా నిలుస్తోంది. గతంలో ఈ జంటకు మంచి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఉండగా, ఇప్పుడు సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో వారి పాత్రలు ఎలా డిజైన్ చేయబడ్డాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మెగాస్టార్ భారీ ఇమేజ్, మరోవైపు కథలో కీలక పాత్రలో త్రిష.. ఈ ఇద్దరి ట్రాక్ సినిమా ఎమోషనల్ కోర్‌ను ఎలా నిర్మిస్తుందో చూడాలి. పైగా డైరెక్టర్ వశిష్ట మల్లిడి ఈ కథను విజువల్‌గా కూడా నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ స్టూడియోలు పని చేస్తున్న ఈ ప్రాజెక్ట్, విజువల్‌గా కూడా విజువల్ వండర్ గా నిలిచే అవకాశాలున్నాయని టాక్.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ రేంజ్ ను ప్రేక్షకులకు అందించాలనే టార్గెట్ తో రూపొందుతోంది. మేకర్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు, త్రిష లుక్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతూ, ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. మొత్తం మీద, అవని పాత్ర చుట్టూ తిరుగుతున్న హైప్, త్రిష కంబ్యాక్ ఎక్స్‌పెక్టేషన్స్, అలాగే మెగాస్టార్‌తో ఆమె కెమిస్ట్రీ.. ఇవన్నీ కలిసి విశ్వంభరను మరో లెవెల్ కు తీసుకెళ్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
