ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన త్రిష..
సౌత్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, తన 44వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు.
By: Tupaki Desk | 4 May 2026 8:00 PM ISTసౌత్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, తన 44వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు. కెరీర్ ప్రారంభం నుంచి స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగిన త్రిష, నటనతో పాటు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పాత రూమర్స్ మళ్లీ వెలుగులోకి రావడం కొత్త విషయం కాదు. ఈసారి కూడా అలాంటి ఓ పాత చర్చే ట్రెండ్ అవుతోంది. అదే ఆమెకు హీరోయిన్ ఆసిన్ తో ఆమెకు మనస్పర్థలు ఉన్నాయనే రూమర్.
2000 గోల్డెన్ ఎరాలో త్రిష-ఆసిన్ ఇద్దరూ టాప్ హీరోయిన్లుగా దూసుకెళ్లిన కాలంలోనే ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చిన వీరిద్దరూ, స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకోవడంతో సహజంగానే పోలికలు, పోటీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్‌తో ఇద్దరూ వేర్వేరు సినిమాల్లో నటించడం ఈ గాసిప్స్‌కు బలాన్నిచ్చింది. విజయ్ వల్లే వారిద్దరికీ విబేధాలొచ్చాయని కూడా కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. స్టార్ హీరోల చుట్టూ ఇలాంటి రూమర్స్ సృష్టించడం కొత్త విషయం కాకపోయినా, త్రిష- ఆసిన్ విషయం మాత్రం చాలా కాలం పాటు చర్చనీయాంశంగా కొనసాగింది.
అయితే, ఈ రూమర్స్‌పై త్రిష చాలా క్లియర్ గా మాట్లాడి దానిపై క్లారిటీ ఇచ్చిన విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్న ఎదురైనప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం రూమర్స్‌కు పూర్తి చెక్ పెట్టేలా ఉంది. తనకు, ఆసిన్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆమెతోనే కాదు, తనకు ఎవరితోనూ గొడవలు లేవని త్రిష స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఒక అవార్డు కార్యక్రమంలో ఆసిన్ తనను అభినందించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, వారి మధ్య ఎప్పుడూ సానుకూల సంబంధాలే ఉన్నాయని తెలిపారు.
త్రిష ఇచ్చిన ఈ క్లారిటీ, ఇండస్ట్రీలో హీరోయిన్ రైవల్రీ ఎలా ఊహాగానాలుగా మారుతుందో తెలియజేసే ఉదాహరణగా నిలుస్తోంది. స్టార్‌డమ్ పెరిగే కొద్దీ వ్యక్తిగత జీవితాలపై వచ్చే అంచనాలు, సోషల్ మీడియా చర్చలు చాలా సార్లు వాస్తవాలకు భిన్నంగా ఉండొచ్చు. త్రిష కేసులో కూడా అదే జరిగింది. సంవత్సరాలుగా కొనసాగిన ఈ గాసిప్స్‌కు, ఆమె ఒక్క స్టేట్‌మెంట్‌తోనే చెక్ పెట్టినట్టు అయింది. త్రిష- ఆసిన్ కాలం నిజంగా సౌత్ సినిమా గోల్డెన్ ఫేజ్‌గా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో వచ్చిన సినిమాలు, స్టార్ కాంబినేషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఆసిన్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ, త్రిష మాత్రం ఇప్పటికీ అదే స్థాయిలో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇవాళ త్రిష పుట్టినరోజు సందర్భంగా మళ్లీ వైరల్ అయిన ఈ రూమర్, ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఇండస్ట్రీలో వినిపించే ప్రతి కథనాన్ని నిజంగా తీసుకోవడం కంటే, సంబంధిత వ్యక్తుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని దీని ద్వారా స్పష్టమవుతుంది.
