Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' కోసం ట్రిప్తి దిమ్రీ పారితోషికం?

ఇప్ప‌టికే నాలుగైదు చిత్రాల‌కు క‌మిటైన ఈ బ్యూటీ, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం కూడా పెంచుకుంది

By:  Tupaki Desk   |   14 March 2024 12:30 AM GMT
యానిమ‌ల్ కోసం ట్రిప్తి దిమ్రీ పారితోషికం?
X

క‌వ్వించే అందం.. వేడెక్కించే వ‌ల‌పు ఉంటే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో రాణించ‌డం క‌ష్ట‌మేమీ కాదు. అదృష్టం కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాలేమో కానీ, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే! అని ఇక్క‌డ ప్రూవ్ అవుతుంది. అలాంటి ఒక రోజొచ్చింది ట్రిప్తి దిమ్రీకి. యానిమ‌ల్ సినిమాలో స్ట్రైకింగ్ లుక్స్ కిల్లింగ్ యాటిట్యూడ్ తో కుర్ర‌కారు గుండెల్లోకి దూసుకుపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు వ‌రుస‌గా ల‌క్ష‌ల్లో అడ్వాన్సులు అందుకుంటోంది. ఇప్ప‌టికే నాలుగైదు చిత్రాల‌కు క‌మిటైన ఈ బ్యూటీ, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం కూడా పెంచుకుంది.

యానిమల్ విడుదల తర్వాత, త్రిప్తి డిమ్రీ నిజ‌మైన‌ సంచలనంగా మారింది. ట్రిప్తీ ఇంట‌ర్వ్యూల‌ కోసం ఈరోజు మీడియా సైతం ప‌డిగాపులు ప‌డుతోందంటే అర్థం చేసుకోవాలి. ఈ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేస్కోవ‌డంలో ట్రిప్తి తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతోంది. త్రిప్తి ప్రస్తుతం భూల్ భూలయ్యా - ఆషికి 3 రూపంలో కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను చేజిక్కించుకుంది. ఇప్పటికే వాటిలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభించింది. త‌దుప‌రి సందీప్ వంగా- ప్ర‌భాస్ కాంబో మూవీ స్పిరిట్ లోను ఈ భామ న‌టించే అవ‌కాశం ఉంది. చేతిలో ఇతర ఆఫర్లు ఉన్నాయి.

అయితే త్రిప్తి దిమ్రీ ఒక్కో సినిమా కోసం ఎంత మొత్తం అందుకుంటోంది? యానిమ‌ల్ కోసం ఎంత అందుకుంది? అంటూ చ‌ర్చ సాగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు సందీప్ రెడ్డి వంగా -ర‌ణ‌బీర్ ల యానిమల్‌లో అతిథి పాత్ర కోసం త్రిప్తికి 40 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. యానిమ‌ల్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత‌ త్రిప్తి ఫేమస్ అయింది. ఇప్పుడు చాలా పెద్ద మొత్తం డిమాండ్ చేస్తోంద‌ని స‌మాచారం.

కార్తీక్ ఆర్య‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న `భూల్ భూలైయా 3` లో చిన్న పాత్ర కోసం త్రిప్తికి కోటి పారితోషికం చెల్లిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇలాంటి క్రేజీ ఆఫ‌ర్లు ఇంకా త‌న ఖాతాలో చాలా ఉన్నాయి. పెద్ద సినిమాల్లో పెద్ద పాత్ర‌ల్లో ఆఫ‌ర్లు ద‌క్కితే 2 కోట్లు అంత‌కుమించి అందుకునే ఛాన్సుంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.