Begin typing your search above and press return to search.

త‌ప్పు చేయ‌లేద‌ని అమ్మ‌-నాన్న‌కి న‌చ్చ‌జెప్పా!

ఈ నేప‌థ్యంలో సినిమాలో ఈ స‌న్నివేశాలు చూసి త‌న త‌ల్లిదండ్రులు చూసి ఎంతో బాధ‌ప‌డ్డారు అన్న సంగ‌తి తాజాగా రివీల్ చేసింది. ఆ సంగ‌తి త్రిప్తి మాట‌ల్లోనే..

By:  Tupaki Desk   |   10 March 2024 3:30 PM GMT
త‌ప్పు చేయ‌లేద‌ని అమ్మ‌-నాన్న‌కి న‌చ్చ‌జెప్పా!
X

'యానిమ‌ల్' హిట్ తో త్రిప్తి డిమ్రీ పాన్ ఇండియాలో ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. ర‌ణ‌బీర్ క‌పూర్ తో ఒక్క రొమాంటిక్ స‌న్నివేశంలో న‌టించే క్రేజీ భామ‌గా మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా తీసుకురాని పేరు గుర్తింపు యానిమ‌ల్ ల్ తో సాధ్య‌మైంది. అది కేవ‌లం ఆన్ రొమాన్స్ తోనే సాధ్య‌మైంది? అని అమ్మ‌డు సైతం ఎంతో ఓపెన్ గా అంగీక‌రించింది.

అయితే ఈ స‌న్నివేవం కార‌ణంగా ఎంత ఫేమ‌స్ అయిందో? అంత‌కంత‌కు త‌న‌పై వ్య‌క్తిగతంగా విమ‌ర్శించిన నోళ్లు ఎన్నో ఉన్నాయి. హీరోల‌తో అలాంటి స‌న్నివేశాలేంటి? ర‌ణ‌బీర్ క‌పూర్ సైతం ఆ స‌న్నివేశం చేస్తోన్న స‌మ‌యంలో ఎంత‌గా అసౌక‌ర్యానికి గుర‌య్యాడో చెప్పాడు. ఈ నేప‌థ్యంలో ఆడపిల్ల అయిన త్రిప్తి డీమ్రీ ఈ విష‌యం గురించి ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో సినిమాలో ఈ స‌న్నివేశాలు చూసి త‌న త‌ల్లిదండ్రులు చూసి ఎంతో బాధ‌ప‌డ్డారు అన్న సంగ‌తి తాజాగా రివీల్ చేసింది. ఆ సంగ‌తి త్రిప్తి మాట‌ల్లోనే..

'ఇంటిమేట్‌ సీన్స్‌లో నేను యాక్ట్‌ చేయడం చూసి అమ్మానాన్న షాకయ్యారు. సినిమాల్లో ఇలాంటి సీన్స్‌ ఎప్పుడూ చూడలేదు. నిన్ను అలాంటి సన్నివేశాల్లో చూసేసరికి మాకు బాధగా అనిపించింది. ఇలాంటివి చేయకుండా ఉండాల్సింది అన్నారు. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి వాళ్లకు కాస్త సమయం పట్టింది. అయితే నేనెలాంటి తప్పు చేయలేదని కేవలం నా వృత్తిలో భాగమేనని వాళ్లకు అర్థమయ్యేలా వివరించి కూల్‌ చేశాను.

సినిమా విడుదలైన తర్వాత ప్రశంసలతో పాటు వెల్లువెత్తిన విమర్శలతో బాగా ఇబ్బంది ప‌డ్డాను. గతంలో ఎప్పుడూ నాకు అలాంటి అనుభవం ఎదురవ్వలేదు. శృంగార సన్నివేశాలు తీస్తున్నప్పుడు నేను.. రణబీర్‌.. దర్శకుడు.. కెమెరామెన్‌ మాత్రమే సెట్‌లో ఉన్నాం. నాకు ఇబ్బంది కలగకుండా వారు చూసు కున్నారు. నాకు అసౌకర్యంగా లేనప్పుడు- నేను చేస్తున్నది తప్పు కాదని నమ్మినప్పుడు.. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం' అని తెలిపింది.