త్రిప్తి కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..!
టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్స్ కూడా తన గ్లామర్ షో కోసమే అన్నట్టుగా తెలుస్తుంది. త్రిప్తి స్కిన్ షోకి తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.
By: Tupaki Desk | 10 Jun 2025 2:00 AM ISTబాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా సరే యానిమల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది త్రిప్తి డిమ్రి. ఒక్క సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోయింది. బీ టౌన్ హా**ట్ బ్యూటీల్లో ఒకరుగా ఆమె సూపర్ ఇమేజ్ తెచ్చుకుంది. యానిమల్ తో కెరీర్ లో జోష్ పెంచుకున్న త్రిప్తి డిమ్రి ఆ నెక్స్ట్ వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే బాలీవుడ్ లో 3 సినిమాల దాకా చేసిన త్రిప్తికి టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాల కోసం కూడా త్రిప్తిని హీరోయిన్ గా అడుగుతున్నారట.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు త్రిప్తిని తీసుకునే అవకాశం ఉందని టాక్. అదే కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా త్రిప్తికి ఛాన్స్ ఇస్తున్నట్టు ఫిం నగర్ టాక్. అందులో ఒకటి పాన్ ఇండియా సినిమా అని తెలుస్తుంది. త్రిప్తి డిమ్రి తెలుగు ఎంట్రీ కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. యానిమల్ సినిమాతో ఆమెకు వచ్చిన హా**ట్ ఇమేజ్ ని కొనసాగించాలని చూస్తుంది త్రిప్తి.
టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్స్ కూడా తన గ్లామర్ షో కోసమే అన్నట్టుగా తెలుస్తుంది. త్రిప్తి స్కిన్ షోకి తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. యానిమల్ తో ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. అంతేకాదు ఆమె చేస్తున్న బాలీవుడ్ సినిమాలకు కూడా సూపర్ బజ్ వస్తుంది. ఇక అమ్మడి ఫోటో షూట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. కీరీర్ పరంగా యానిమల్ తో వచ్చిన ఈ హై ని ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతుంది త్రిప్తి డిమ్రి.
తెలుగు ఎంట్రీ ఇస్తే మాత్రం అమ్మడికి ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. కచ్చితంగా త్రిప్తి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి తారక్ నీల్ సినిమాలోనే అమ్మడి పేరు వినిపిస్తుండగా నెక్స్ట్ రాబోతున్న సినిమాల డీటైల్స్ కూడా త్వరలో తెలుస్తాయి. త్రిప్తి ఏం చేసినా సరే ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అమ్మడి ఫోటో షూట్స్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉండగా సౌత్ సినిమాల్లో అమ్మడి హవా మొదలైతే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో త్రిప్తి పేరు మారుమోగేలా ఉంటుందని అంటున్నారు.
