చేప పిల్లలా నీటిలో ఈదుతున్న ట్రిప్తి
బ్యాక్ టు బ్యాక్ బంపర్‌హిట్స్ అందుకుంది ట్రిప్తి దిమ్రీ. సందీప్ వంగా `యానిమల్`లో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ రోల్ తన కెరీర్ గేమ్ ని అమాంతం మార్చేసింది.
By: Tupaki Desk | 6 July 2025 11:09 PM ISTబ్యాక్ టు బ్యాక్ బంపర్‌హిట్స్ అందుకుంది ట్రిప్తి దిమ్రీ. సందీప్ వంగా 'యానిమల్'లో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ రోల్ తన కెరీర్ గేమ్ ని అమాంతం మార్చేసింది. ఆ తర్వాత `గుడ్ న్యూజ్`తో మరో హిట్టందుకున్న ట్రిప్తి, 'భూల్ భులయా 3' లాంటి క్లాసిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'స్పిరిట్'లో అవకాశం అందుకుంది. కెరీర్‌లో రెండోసారి సందీప్ వంగాతో కలిసి పని చేసే అవకాశం అందుకుంది. స్పిరిట్ కేవలం పాన్-ఇండియాలోనే కాకుండా పాన్ వరల్డ్ లో విడుదల చేయాలని వంగా టీమ్ ప్రణాళికల్లో ఉందని కథనాలొస్తున్నాయి. అంటే.. ట్రిప్తి పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగడం ఖాయం.
కెరీర్ పీక్ లో ఉన్న ఈ దశలో ట్రిప్తి దిమ్రీ నెటిజనులను ఆకర్షించేందుకు నిరంతర ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ భామ ఏకాంతంగా స్విమ్ చేస్తున్న ఫోటోలు, వీడియో అంతర్జాలాన్ని లీకయ్యాయి. ఇటీవలే ముంబై బాంద్రాలోని ఖరీదైన ఓ బంగ్లా కొనుక్కున్న ట్రిప్తి తన నివాసంలోని స్విమ్మింగ్ పూల్ లో ఇలా జలకాలాడుతోందని అభిమానులు భావిస్తున్నారు. ఇంతకుముందు ఒంటరి దీవిలో పూల్ లో స్విమ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసిన ట్రిప్తి ఈసారి ఎలాంటి హంగామా లేకుండా ప్రశాంతంగా స్విమ్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.