'యానిమల్' బ్యూటీకి దెబ్బ మీద దెబ్బ..!
తాజాగా త్రిప్తికి మరో షాక్ తగిలింది. ఇటీవలే ఈమె ప్రముఖ హీరో షాహిద్ కపూర్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింది.
By: Tupaki Desk | 3 July 2025 3:15 PM ISTరణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'యానిమల్'. 2023లో విడుదలైన యానిమల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న పాత్రతో పోల్చితే త్రిప్తి డిమ్రి పోషించిన జోయ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పాత్ర ఉన్నది కొంత సమయం అయినా కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రణబీర్ కపూర్, త్రిప్తి కాంబోలో ఉన్న రొమాంటిక్ సీన్స్ సినిమా స్థాయిని మరో లెవల్‌కి తీసుకు వెళ్లాయి అంటూ చాలా మంది రివ్యూలు ఇచ్చారు. దాంతో త్రిప్తి డిమ్రి క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటిస్తోంది.
ఈ సమయంలో త్రిప్తి డిమ్రిని ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి చెందిన పీఆర్ టీం డీ గ్రేడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆమెను కెరీర్ పరంగా వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రిప్తితో సినిమాలు చేయవద్దని చాలా మంది దర్శక నిర్మాతలతో సదరు పీఆర్ టీం చెప్పిందని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పీఆర్ టీం చేసిన పబ్లిసిటీ కారణంగా త్రిప్తి డిమ్రి ఇప్పటికే పలు ఆఫర్లను చేజార్చుకుందట. తాజాగా త్రిప్తికి మరో షాక్ తగిలింది. ఇటీవలే ఈమె ప్రముఖ హీరో షాహిద్ కపూర్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఆ సినిమాను రూపొందిస్తున్నారు.
షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలో త్రిప్తి డిమ్రి పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. సింగిల్ కార్డ్ హీరోయిన్ అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయట. త్రిప్తి పాత్ర పరిధిని తగ్గించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్ల అనుసారం ఈ సినిమాలో మరో అందాల ముద్దుగుమ్మ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. మొదట దిశా పటానీని ఈ సినిమాలోని రెండు పాటల కోసం ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. షాహిద్ కపూర్‌తో కలిసి దిశా పటానీ రెండు పాటల్లో కనిపించబోతుందని అంటున్నారు. కానీ అంతకు మించి ఆమె ఉంటుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
యానిమల్ తర్వాత త్రిప్తి డిమ్రికి సాలిడ్ హిట్ పడలేదు. చేసిన సినిమాలన్నీ పెద్దగా ప్రాముఖ్యత లేని సినిమాలే కావడంతో ఈ సినిమాపై త్రిప్తి చాలా ఆశలు పెట్టుకుంది. ఇలాంటి సమయంలో దిశా పటానీని ఈ సినిమాలో దించడం తో ఆమె ప్రాముఖ్యత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఖచ్చితంగా త్రిప్తి కెరీర్‌కు పెద్ద దెబ్బ అనే అభిప్రాయంను బాలీవుడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగ రూపొందించబోతున్న స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. షాహిద్ కపూర్ సినిమా హిట్ అయ్యి, స్పిరిట్ కూడా సక్సెస్ అయితే త్రిప్తి బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఖ్యాతి దక్కించుకునేది. కానీ ఇప్పుడు షాహిద్ కపూర్ సినిమా క్రెడిట్ ఆమెకు ఎంత దక్కుతుందో చెప్పలేం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
