నటిగా అప్పుడే తర్వాతి స్థాయికి వెళ్లగలం
ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మిక నటించినప్పటికీ రష్మిక కంటే ఎక్కువగా త్రిప్తి డిమ్రినే ఎక్కువ గుర్తింపు అందుకున్నారు.
By: Tupaki Desk | 17 July 2025 8:30 AM ISTయానిమల్ సినిమాతో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయారు త్రిప్తి డిమ్రి. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మిక నటించినప్పటికీ రష్మిక కంటే ఎక్కువగా త్రిప్తి డిమ్రినే ఎక్కువ గుర్తింపు అందుకున్నారు. యానిమల్ లో త్రిప్తి అందం, రణ్‌బీర్ తో కలిసి ఆమె చేసిన ఇంటిమేట్ సీన్స్, త్రిప్తిని సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్ చేసిన విధానం అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.
దీంతో యానిమల్ తర్వాత త్రిప్తికి ఆఫర్లు కూడా బాగా వచ్చాయి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న త్రిప్తికి రీసెంట్ గా మరో బంపరాఫర్ దక్కిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో త్రిప్తి హీరోయిన్ గా ఎంపికయ్యారు. స్పిరిట్ లో ముందు హీరోయిన్ గా దీపికాను అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టులోకి త్రిప్తి వచ్చారు.
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న త్రిప్తి నటించిన ధడక్2 ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన త్రిప్తి తన రాబోయే సినిమాల గురించి మాట్లాడారు. డిఫరెంట్ కథల్లో భాగమైనప్పుడు నటిగా నెక్ట్స్ లెవెల్ కు వెళ్లగలమని, ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు త్రిప్తి.
కొత్త వ్యక్తులతో కలిసి పని చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తుందని, వారి నుంచి చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చని, ప్రస్తుతం తాను విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నానని, అది ఈ ఏడాదే రిలీజ్ కానుందని చెప్పిన త్రిప్తి, దాంతో పాటూ స్పిరిట్ లో కూడా యాక్ట్ చేస్తున్నానని చెప్పారు. స్పిరిట్ సినిమాను సందీప్ రెడ్డి వంగా చాలా గొప్పగా రూపొందిస్తున్నారని, ఆ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని త్రిప్తి తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న స్పిరిట్ ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని డైరెక్టర్ సందీప్ సన్నాహాలు చేస్తున్నారు.
