Begin typing your search above and press return to search.

ఒంట‌రి బీచ్‌ని మ‌రిగించిన క్రేజీ బ్యూటీ!

ఇప్పుడు ఒంట‌రి బీచ్ లో టూపీస్ లో ప్ర‌త్య‌క్ష‌మై మ‌రోసారి వేడి పెంచింది.

By:  Tupaki Desk   |   28 April 2025 9:51 AM IST
Tripti Dimri Beach Photoshoots
X

బికినీలు.. స్విమ్ సూట్లు .. టూపీస్.. కాదేదీ సెల‌బ్రేష‌న్ కి అన‌ర్హం! ఒంటిపై ప‌రిమితమైన దుస్తుల్లో కనిపించ‌డం ట్రిప్తి దిమ్రీ ప్ర‌త్యేక‌త. `యానిమ‌ల్` చిత్రంలో క‌నిపించింది కొన్ని నిమిషాలే అయినా కుర్ర‌కారు మైండ్ లో తిష్ఠ వేసుకుని కూచోడానికి ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షో, ఎక్స్ పోజింగ్ ఒక ప్ర‌ధాన‌ కార‌ణం. ముఖ్యంగా సందీప్ వంగా ట్రిప్తీని ఎలివేట్ చేసిన తీరు అలాంటిది. ట్రిప్తీ అందానికి ఆక‌ర్షితుడ‌య్యే పంజాబీ ధ‌నికుడు రణ్ విజ‌య్ గా ర‌ణ‌బీర్ తో సీన్లు ర‌క్తి క‌ట్టించాయి.

అయితే ఇప్పుడు అదే ఫ్లేవ‌ర్ ని నిజ జీవితంలోకి అనువ‌ర్తించింది ట్రిప్తీ. ఈ అమ్మ‌డు ప‌బ్లిక్ లో క‌నిపించినా లేదా ఒంట‌రి బీచ్ ల‌లో క‌నిపించినా ఇంచుమించు ఆడియెన్ త‌నతో ఏ ఉద్ధేశంతో క‌నెక్ట‌యి ఉన్నారో దానిని అందించే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఒంట‌రి బీచ్ లో టూపీస్ లో ప్ర‌త్య‌క్ష‌మై మ‌రోసారి వేడి పెంచింది.


బీచ్ రిసార్ట్ లో ట్రిప్తీ టోన్డ్ బాడీని ఎలివేట్ చేస్తూ ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. దీనికి ప్ర‌శాంత‌త‌లో మునిగిపోనిద్దాం! అంటూ స‌ర‌దా క్యాప్ష‌న్ ని ఇచ్చింది. వైట్ బికినీ టాప్- మినీ స్కర్ట్ లో ట్రిప్తి టోన్డ్ బాడీ ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతోంది. ముఖ్యంగా రిసార్ట్ లో ట్రిప్తి స్వేచ్ఛా విహారం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ట్రిప్తి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తోంది. భూల్ భూలైయా 3 సహనటి మాధురీ దీక్షిత్‌తో `మా బెహన్` అనే కామెడీ డ్రామాలో న‌టించ‌నుంది. మొదటిసారిగా విశాల్ భరద్వాజ్ `అర్జున్ ఉస్తారా`లో షాహిద్ కపూర్ స‌ర‌స‌న న‌టిస్తోంది. సిద్ధాంత్ చతుర్వేదితో రొమాంటిక్ డ్రామా `ధడక్ 2` చిత్రీకరణలోను ట్రిప్తి బిజీగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జాన్వీ 2018 హిట్ `ధడక్`కు సీక్వెల్.