Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ బ్యూటీ నేచుర‌ల్ హొయ‌లు

ట్రిప్తి తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. నేచుర‌ల్ బ్యూటీ ఎంతో వేడిగా ఉందంటూ ఈ ఫోటోల‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   28 April 2024 8:13 AM GMT
యానిమ‌ల్ బ్యూటీ నేచుర‌ల్ హొయ‌లు
X

'యానిమ‌ల్' రిలీజ్ త‌ర్వాత జోయా గురించే ఎక్కువ‌గా చ‌ర్చ సాగింది. ఈ పాత్ర‌లో త‌న‌దైన అందం అద్భుత న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది ట్రిప్తి దిమ్రీ. యానిమ‌ల్ చిత్రంలో జోయా పాత్ర‌లో జీవించింది. ర‌ణ‌బీర్ తో రొమాన్స్ ని తెర‌పై అద్భుతంగా పండించింది. ఓవైపు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ర‌ణ‌బీర్ భార్య పాత్ర‌లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ తో క‌ల్టి ప‌డేస్తున్నా.. సినిమా మ‌ధ్య‌లో ఎంట‌రైన జోయా పాత్ర కుర్ర‌కారు గుండెల్ని మ‌రిగించింది అంటే అతిశ‌యోక్తి కాదు. కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు ట్రిప్తి దిమ్రీ మోస్ట్ ప్రామిస్సింగ్ పెర్ఫామ‌ర్ గా వెలిగిపోతోంది. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో అవ‌కాశాల‌కు ఇది దారి తీసింది.

ట్రిప్తి అనూహ్యంగా నేష‌న‌ల్ క్ర‌ష్ గా అవ‌త‌రించింది. ఇప్పుడు ఆ ఫేమ్ ని నిల‌బెట్టుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. సోష‌ల్ మీడియాల్లో ఈ బ్యూటీ నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ట్రిప్తి తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. నేచుర‌ల్ బ్యూటీ ఎంతో వేడిగా ఉందంటూ ఈ ఫోటోల‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఎండలో త‌డిసిముద్ద‌య్యాను..! అంటూ దీనికి ట్రిప్తి అద్భుత‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది. నిజానికి ట్రిప్తి ఎంతో నేచుర‌ల్ గా క‌నిపిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్స్ ని ప‌రిశీలిస్తే.. త‌న‌పై స‌న్న‌ని సూర్య కాంతి ప‌డుతుంటే చెమ‌ట‌ల‌తో త‌డిసిపోయి క‌నిపిస్తోంది. అందుకే ఈ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఎలివేట్ అవుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న 'బాడ్ న్యూజ్' చిత్రంలో ట్రిప్తి దిమ్రీ వేడెక్కించే పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్ప‌టికే విడుద‌లై ఆక‌ట్టుకున్నాయి. విడుదల తేదీని ఇంత‌కుముందే ప్ర‌క‌టించారు. ట్రిప్తి క్రేజ్ విక్కీ సినిమాకి ప్ర‌ధాన ఆయుధంగా మార‌నుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజఘటనల ఆధారంగా రూపొందుతోంది. అరుదైన వైద్య పరిస్థితి ఆధారంగా ఈ సినిమా కథాంశాన్ని రూపొందించార‌ని తెలుస్తోంది.

తాజా క‌థ‌నాల ప్రకారం.. బాడ్ న్యూజ్ క‌థాంశంలో ''గర్భం ప్రధాన వివాదాస్ప‌ద ఇతివృత్తంగా ఉంటుంది''. హెటెరోపేటర్నల్ సూపర్‌ఫెకండేషన్ అనే వైద్య పరిస్థితి ఆధారంగా వివాదాస్ప‌ద క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఒక స్త్రీ వేర్వేరు పురుషుల నుండి కవలలతో గర్భవతి అవుతుంది. బాడ్ న్యూజ్ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రం ట్రిప్తీ కి మొదటి లైట్ హార్టెడ్ కామెడీ డ్రామా. ఈ చిత్రంలో విక్కీ - అమ్మీలతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ట్రిప్తీ తన కెరీర్ కోసం ఎంత దూర‌మైనా వెళ్లగలిగే 'ప్రతిష్టాత్మకమైన చెఫ్' పాత్రలో కనిపించనుందని సమాచారం. బాడ్ న్యూజ్ 19 జూలై 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఇంతకు ముందు 'మెహబూబ్ మేరే సనమ్' అనే పేరు పెట్టారు. ఇది ఫిబ్రవరి 2024లో విడుదల కావాల్సి ఉంది. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆలస్యం అయింది. ఈ చిత్రంలో నేహా ధూపియా కూడా నటిస్తోంది. విక్కీ - ట్రిప్టి జంట‌పై ఒక స్పెష‌ల్ రొమాంటిక్ సాంగ్ ని కూడా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.