Begin typing your search above and press return to search.

యానిమల్‌ స్టార్ కి నిద్రలేని రాత్రులు..!

అయితే రష్మిక మందన్నా కంటే కూడా ఇప్పుడు ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రీ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 4:30 PM GMT
యానిమల్‌ స్టార్ కి నిద్రలేని రాత్రులు..!
X

రణబీర్ కపూర్‌, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ వసూళ్లు నమోదు చేసిన యానిమల్ సినిమాలో హీరోయిన్‌ గా రష్మిక మందన్న నటించిన విషయం తెల్సిందే. అయితే రష్మిక మందన్నా కంటే కూడా ఇప్పుడు ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రీ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.

నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న క్వాలా అనే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకులకు త్రిప్తి పరిచయం అయింది. ఆ వెబ్‌ సిరీస్ పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. కానీ ఆ వెబ్‌ సిరీస్ కారణంగా దర్శకుడు సందీప్‌ వంగ దృష్టిలో త్రిప్తి డిమ్రీ పడేలా చేసింది అనడంలో సందేహం లేదు.

సినిమాలో బోల్డ్‌ సన్నివేశాలు ఉన్నాయని తెలిసి కూడా కథ కు అవసరం అని భావించి నటించేందుకు ఓకే చెప్పాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి డిమ్రీ మాట్లాడుతూ యానిమల్‌ సినిమా తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది అనే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

త్రిప్తి ఇప్పుడు కొత్త నేషనల్‌ క్రష్ గా పేరు దక్కించుకుంది. యానిమల్‌ సినిమా తర్వాత తాను చాలా ప్రేమను పొందుతూ ఉన్నాను. నా ఫోన్‌ ఎప్పుడూ కూడా రింగ్‌ అవుతూనే ఉంది. నాకు వస్తున్న మెసేజ్ లు చదవడానికి చాలా సమయం పడుతూ ఉంది. నాకు వస్తున్న ప్రశంస మెసేజ్ లు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

నా సోషల్‌ మీడియా పోస్ట్‌ లకు మరియు నా ఫోన్ కు వచ్చిన మెసేజ్ లు చదివేందుకు నేను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని కూడా సరదాగా త్రిప్తి డిమ్రీ చెప్పుకొచ్చింది. ఓవర్‌ నైట్ స్టార్‌ అని అంటూ ఉంటాం... అది త్రిప్తి డిమ్రీ విషయంలో అక్షరాల నిజం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.