Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ త్రిప్తి డిమ్రీపై మ‌రో రూమ‌ర్

ఇప్పుడు 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రీని మేకర్స్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యానిమల్‌ను నిర్మించిన టి-సిరీస్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 6:17 AM GMT
యానిమ‌ల్ త్రిప్తి డిమ్రీపై మ‌రో రూమ‌ర్
X

'యానిమల్' విడుదల తర్వాత త్రిప్తి డిమ్రీ దేశంలో సంచలనంగా మారింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న‌- స్పిరిట్, కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న - ఆషికి 3 వంటి భారీ అవ‌కాశాల్ని అందుకుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కానీ ఇవేవీ అధికారికం కాదు. ఈ రెండు సినిమాల్ని నిర్మిస్తున్న టీసిరీస్ అధికారికంగా ఇంకా దేనినీ ధృవీక‌రించ‌లేదు.

ఆషికి భారతీయ సినిమాలో కల్ట్ క్లాసిక్. దాని సీక్వెల్ ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఆషికీ 2 కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. శ్రద్ధా కపూర్‌కు స్టార్ స్టేటస్ తెచ్చిన చిత్ర‌మిది. మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ లో శ్ర‌ద్ధా గాయ‌నిగా న‌టించింది. ఈ సిరీస్‌లో మూడో భాగమైన ఆషికీ 3 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.

ఇప్పుడు 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రీని మేకర్స్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యానిమల్‌ను నిర్మించిన టి-సిరీస్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. త్రిప్తి డిమ్రీని కథానాయికగా తీసుకున్నార‌ని కొన్ని మీడియాలు క‌థ‌నాలు రాస్తున్నాయి. కానీ దీనిపై చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు. ఇంత‌కుముందు ఆషికి 3లో త్రిప్తిని ఎంపిక చేసామ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని నిర్మాతలు వ్యాఖ్యానించారు. కానీ ఇంత‌లోనే త‌న పేరును ముడిపెడుతూ ఆషిఖి 3 గురించి ప్ర‌చారం సాగించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.