Begin typing your search above and press return to search.

త్రిప్తి.. రెమ్యునరేషన్ అంతేనా?

ఈ సినిమాకు త్రిప్తి కేవలం రూ.40 లక్షలే తీసుకుందట. ఇది బాగానే తక్కువ అయినప్పటికీ.. యానిమల్ మూవీ సమయంలో ఆమె ఎవరికీ తెలియదు.

By:  Tupaki Desk   |   14 March 2024 9:57 AM GMT
త్రిప్తి.. రెమ్యునరేషన్ అంతేనా?
X

యానిమల్ మూవీ.. ఎంతటి విమర్శలు అందుకుందో.. అంతకుమించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకుపైగా రాబట్టి ఎన్నో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా పలు రికార్డులు బద్దలుకొడుతోంది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సాధించి.. తెలుగు రాష్ట్రాల్లో రూ.25 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాతో త్రిప్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హీరోయిన్ గా నటించిన రష్మిక కన్నా త్రిప్తినే ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు.

మూవీలో జోయ పాత్రలో స్క్రీన్‌ పై త్రిప్తి కనిపించింది కొద్ది సమయమే. కానీ ఆమె యాక్టింగ్ తోపాటు లుక్స్ కు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రణబీర్‌, త్రిప్తి మధ్య వచ్చే ఇంటిమేట్ సన్నివేశాలు ముఖ్యంగా హైలెట్ అయ్యాయి. వాటికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎవరెవరో పాటలో ఆమె ఎక్స్ప్రెషన్స్ వేరే లేవెల్. ఈ సినిమా తర్వాత త్రిప్తికి ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ఆమెకు వరుస సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయి.

అయితే ఈ మూవీకి గాను త్రిప్తి.. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసి అంతా షాకవుతున్నారు. ఈ సినిమాకు త్రిప్తి కేవలం రూ.40 లక్షలే తీసుకుందట. ఇది బాగానే తక్కువ అయినప్పటికీ.. యానిమల్ మూవీ సమయంలో ఆమె ఎవరికీ తెలియదు. అందుకే రూ.40 లక్షలకే ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ఆమె పారితోషికాన్ని బాగా పెంచేసిందట.

హిందీ చంద్రముఖి భూల్ భుల‌యా-3లో నటిస్తోంది త్రిప్తి. ఈ సూపర్ హిట్ సీక్వెల్ లో నటిస్తున్న ఈ అమ్మడు.. రూ. కోటి రూపాయలు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఆమె నటించనుందట. మరి యానిమల్ తర్వాత త్రిప్తి నటించిన సినిమాలు హిట్ అయితే.. ఆమె రెమ్యునరేషన్ రూ.రెండు కోట్లుగా మారడం పక్కా.