Begin typing your search above and press return to search.

స్పిరిట్ హీరోయిన్‌తో ఆర్జీవీ వెట‌కారం

ఇప్పుడు సందీప్ వంగా `స్పిరిట్`లో ప్ర‌భాస్ స‌ర‌స‌న ఎంపికైన ట్రిప్తి దిమ్రీని పెంచేందుకు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చేసిన ఒక ప్ర‌య‌త్నం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

By:  Tupaki Desk   |   27 May 2025 4:17 AM
స్పిరిట్ హీరోయిన్‌తో ఆర్జీవీ వెట‌కారం
X

ఒక‌రిని పెంచాల‌న్నా, ఒక‌రిని తుంచాల‌న్నా సోష‌ల్ మీడియాల్లో స్పంద‌న‌లు చాలు. ఇప్పుడు సందీప్ వంగా `స్పిరిట్`లో ప్ర‌భాస్ స‌ర‌స‌న ఎంపికైన ట్రిప్తి దిమ్రీని పెంచేందుకు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చేసిన ఒక ప్ర‌య‌త్నం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఆర్జీవీ ఎక్స్ లో ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్ల‌కు త‌న‌దైన శైలిలో ప్ర‌మోట్ చేసారు. ఇప్పుడు ట్రిప్తి దిమ్రీ అలాంటి అరుదైన అవ‌కాశం అందుకుంది. దీపిక ప‌దుకొనే లాంటి అగ్ర క‌థానాయిక‌ను రెండో ఆలోచ‌న లేకుండా ట్రిప్తీతో రీప్లేస్ చేసిన సందీప్ వంగా డేర్ కి గ‌ట్స్ కి ప్ర‌శంస‌లు కురుస్తుంటే, ఇప్పుడు ఆర్జీవీ కొంత వ్యంగ్యంగా అయినా ట్రిప్తీని ఎక్స్ లో హైలైట్ చేయ‌డం నెటిజ‌నుల్లో బిగ్ డిబేట్ కి తెర తీసింది.

స్పిరిట్‌లో త్రిప్తి దిమ్రీని ఎంపిక చేసినందుకు సందీప్ రెడ్డి వంగాను ఆర్జీవీ మొద‌ట‌ ప్రశంసించారు. రణబీర్ కపూర్ స‌ర‌స‌న యానిమ‌ల్‌ చిత్రంలో త్రిప్తి నటనను అభినందించారు. అత‌డి మాటలకు పొంగిపోయిన ట్రిప్తీ వెంట‌నే ఎక్స్ లో కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు త్రిప్తి ఎక్స్ పోస్ట్‌కి RGV మరో అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ''ధన్యవాదాలు సార్.. మీ నుండి చాలా రావడం అంటే అర్థం...(ఏమిటో)!'' అని కొంత తెలివిగానే థాంక్యూ చెప్పింది ట్రిప్తీ. దానికి ఆర్జీవీ వ్యంగ్య‌మైన ప్ర‌తిస్పంద‌న మ‌రోసారి నెటిజ‌నుల్ని టీజ్ చేసింది. ''ANIMALలో మీరు చూపించిన ఆత్మ గొప్పది.. మీరు చంపుతారని నాకు తెలుసు'' అని ఆర్జీవీ ట్రిప్తీ గురించి వ్యాఖ్యానించారు. చూపించిన ఆత్మ అంటే ట్రిప్తీలో గ్లామ‌ర్ కోణం గురించి ఆర్జీవీ కామెంట్ ఇది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ట్రిప్టి డిమ్రీ యానిమల్ లో బోల్డ్ గా కనిపించడంపై అతను వ్యంగ్యంగా కామెంట్ చేసాడ‌ని నెటిజ‌నులకు అర్థ‌మైంది.

యానిమ‌ల్ అంటేనే అది అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించ‌గా, మ‌రో యానిమ‌ల్ సినిమాని ఊహిస్తున్నామ‌ని మ‌రొక నెటిజ‌న్ వ్యాఖ్యానించాడు. ట్రిప్టి డిమ్రీ యానిమల్ లో రణబీర్ కపూర్ తో చాలా బోల్డ్ సన్నివేశాలు చేసింది. అందువల్ల, స్పిరిట్ లో కూడా ఆమెకు బోల్డ్ పాత్ర ఉంటుందని చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు. ట్రిప్తి న‌టించిన ధ‌డ‌క్ 2 త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు వ‌స్తోంది. త‌దుప‌రి ప్ర‌భాస్ తో స్పిరిట్ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉంది.