అఫీషియల్:ప్రభాస్‌కు జోడీగా `యానిమల్` బ్యూటీ
సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2025 6:53 PM ISTసంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాయి. ఇందులోప్రభాస్‌కు జోడీగా ఎవరు నటిస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి దీపిక పలు కండీషన్‌లు పెట్టిందని తెలిసింది.
తెలుగు డబ్బింగ్ చెప్పననడం, 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం, సినిమా లాభాల్లో వాటా కోరడం వంటి కండీషన్‌ల కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తనని పక్కన పెట్టాడని వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం ఏస్తూ శనివారం సందీప్‌రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. `స్పిరిట్` మూవీలో `యానిమల్` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించి షాక్ ఇచ్చాడు. నా సినిమాలో ఫిమేల్ లీడ్ ని అఫీషియల్‌గా ప్రకటిస్తున్నానని త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు.
దీంతో ఇన్ని రోజులుగా `స్పిరిట్`లో ప్రభాస్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? అనే చర్చకు తెర పడింది. అయితే ఇటీవల దీపిక గురించి వచ్చిన వార్తలపై మాత్రం సందీప్ సైలెంట్‌గానే సమాధానం చెప్పడం విశేషం. నా సినిమాలో హీరోయిన్ ఇప్పుడు అధికారికంగా ఎంపికైంది` అంటూ ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెల్కమ్ ఆన్ బోర్డ్ అని కొంత మంది దర్శకులు, చిత్రబృదం ప్రకటిస్తున్న వేళ సందీప్‌రెడ్డి వంగ మాత్రం ఇందుకు భిన్నంగా `నా సినిమాలో హీరోయిన్ అఫీషియల్‌గా ఎంపికైంది` అంటూ ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
దీపికా పదుకునే ఎపిసోడ్ కారణంగానే సందీప్ రెడ్డి వంగ ఇలా అఫీషియల్ అంటూ కోట్ చేసి మరీ ప్రకటించాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే `స్పిరిట్`లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మొత్తం తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ స్పిరిట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
