అమ్మాయిగా మారినా వాష్ రూమ్ కి వెళ్లనివ్వలేదు!
దేశంలోనే రెండవ ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా త్రినేత్ర హవాల్దార్. ఎన్నో అవమానాలు..ఆటంకాలు ఎదుర్కుని డాక్టర్ విద్యను అభ్యసించింది.
By: Tupaki Desk | 13 Jun 2025 12:00 AM ISTదేశంలోనే రెండవ ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా త్రినేత్ర హవాల్దార్. ఎన్నో అవమానాలు..ఆటంకాలు ఎదుర్కుని డాక్టర్ విద్యను అభ్యసించింది. దీంతో ఆమె పేరు ట్రెండింగ్ లో కి వచ్చింది. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్ లో నటిగానూ కనిపించింది. ఇటీవలే రిలీజ్ అయిన 'కంఖజు' అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. తాజాగా త్రినేత్రకు సోసైటీ నుంచి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పు కొచ్చింది.
'ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాక ఓసారి డాక్టర్ ను కలవడానికి ఆసుపత్రికి వెళ్లాను. అప్పుడు వాష్ రూమ్ అవసరం పడింది. అప్పటికీ నా ముఖంలో అమ్మాయి పోలీకలు లేవు. అలాగని అబ్బాయి వాష్ రూమ్ వాడుకోలేను. దీంతో ధైర్యం చేసి అమ్మాయిల వాష్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేసాను. వెంటనే అక్కడ ఉన్న లేడీ గార్డ్ అందులోకి వెళ్లకుండా అడ్డుకుంది. కోపంతో నన్ను అక్కడ నుంచి తోసేసింది.
అందులో ఆమె తప్పు లేదు. నేను అబ్బాయిని అనుకుని అలా చేసింది. నేను కూడా ఆమెతో ఎలాంటి గొడవకు దిగలేదు. కానీ ఈ ఘటనతో నా మనసు ఎంతో గాయపడింది. అమ్మాయిగా మారినా ఆడవారి వాష్ రూమ్ లోకి వెళ్లలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని అవమానాలు కాలేజీలో ఊహించే వాష్ రూమ్ కి వెళ్లేదాన్ని కాదు. కాలేజీకి వెళ్లే ముందు ..కాలేజీ లో ఉన్న సమయంలో నీళ్లు తాగేదాన్ని కాదు.
వాటర్ తాగితే టాయిలెట్ ఇబ్బంది ఎదురవుతుందని చాలా తక్కువ మొతాదులోనే తాగేదాన్ని. దీంతో యూరినరీ ఇన్పెక్షన్ కూడా అయింది. ఇలాంటి వివక్ష ఎదుర్కునే సమాజంలో బ్రతకడం అన్నది శోచనీయం. డాక్టర్ చదివిన నా పరిస్థితే ఇలా ఉందంటే సాధారణ ట్రాన్స్ జెండర్ల పరిస్థితి సమాజంలో ఇంకెత ఘోరంగా ఉంటుందో ఊహించగలను. ఇలాంటి వివక్షపై మార్పు రావాలి. సాధారణ ప్రజల్లో ఇలాంటి అంశాలపై ఇంకా చాలా అవగాహన అవసరం ఉంది' అని అన్నారు.
