Begin typing your search above and press return to search.

త్రినాధ‌రావు కాంపౌండ్ లో ఇవానా!

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన త్రినాధ‌రావు న‌క్కిన‌కు `మ‌జాకా` బ్రేక్ వేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 May 2025 1:50 PM IST
త్రినాధ‌రావు కాంపౌండ్ లో ఇవానా!
X

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన త్రినాధ‌రావు న‌క్కిన‌కు `మ‌జాకా` బ్రేక్ వేసిన సంగ‌తి తెలిసిందే. అంతకు ముందు ర‌వితేజ‌తో `ధ‌మాకా` అంటూ హిట్ అందుకున్నాడు. ఇదే వేడిలో `మ‌జాకా` అంటూ వ‌చ్చాడు. కానీ ఈసినిమా మాత్రం ఆశించిన ఫ‌లితాన్నిసాధించ‌లేదు. అటుపై యంగ్ హీరో హ‌వీస్ తో ఓసినిమా కూడా ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా ఇవాను ప‌రిశీలిస్తున్నారు.

హ‌వీష్‌కి పెయిర్ గా ఇవానా ప‌ర్పెక్ట్ గా ఉంటుంద‌ని త్రినాద‌రావు భావిస్తున్నాడుట‌. ఇప్ప‌టికే ఆమె తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. అయితే అమ్మ‌డి ఎంట్రీ ఇంకా ఫైన‌ల్ అవ్వ‌లేదు. మ‌రో ఇద్ద‌రు యువ నాయిక‌ల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఆ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌ర్ని తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఛాన్సెస్ ఎక్కువ‌గా ఇవానాకే క‌నిపిస్తున్నాయి. ఈ బ్యూటీ ఇటీవ‌లే `సింగిల్` తో స్ట్రెయిట్ తెలుగు హిట్ అందుకుంది.

అంత‌కు ముందు `ల‌వ్ స్టోరీ` తో టాలీవుడ్ యూత్ కి క‌నెక్ట్ అయింది. సింగిల్ తో మ‌రింత ఫేమ‌స్ అయింది. ఇవానాతో పాటు క‌యాదు లోహార్, మ‌మ‌తా బైజు కూడా అంతే ఫేమ‌స్ అయ్యారు. మ‌రి వీళ్ల‌తో గ‌నుక త్రినాధ రావు డిస్క‌ష‌న్స్ చేస్తే కాంపిటీష‌న్ ట‌ఫ్ గానే ఉంటుంది. ముగ్గురు భామ‌ల‌కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌మ‌తా బైజు...క‌యాదు లోహార్ కి తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

ప‌ర‌భాష‌ల్లో ఈ భామ‌లు బిజీగా ఉన్నారు. ఇవానా మాత్రం టాలీవుడ్ ...కోలీవుడ్ ఫోక‌స్ గానే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. మ‌రి ముగ్గురిలో ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి. త్రినాధ‌రావు సినిమాల్లో హీరోయిన్లు అంటే? వాళ్ల పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. పాట‌ల‌కు...రొమాన్స్ కు మాత్రమే కాకుండా న‌ట‌న‌కు ఆస్కారం ఉంటుంది. ఇవానా లాంటి ఎన‌ర్జిటిక్ పెర్పార్మ‌ర్ కి త్రినాధ‌రావు తోడైతే ఆ ఎన‌ర్జీ వేరే లెవల్లో ఉంటుంది. మ‌రి ఆ ఛాన్స్ ఇవానాకి వ‌స్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.