Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : తెల్ల గులాబీ చేతిలో తెల్ల గులాబీ

బెంగాళి ముద్దుగుమ్మ త్రిధా చౌదరి తెలుగు ప్రేక్షకులకు సూర్య వర్సెస్ సూర్య సినిమాతో పరిచయం అయిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   9 Feb 2024 1:30 PM GMT
పిక్ టాక్‌ : తెల్ల గులాబీ చేతిలో తెల్ల గులాబీ
X

బెంగాళి ముద్దుగుమ్మ త్రిధా చౌదరి తెలుగు ప్రేక్షకులకు సూర్య వర్సెస్ సూర్య సినిమాతో పరిచయం అయిన విషయం తెల్సిందే. అంతకు ముందే ఈ అమ్మడు పలు బెంగాళి సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది.


తెలుగు లో పలు సినిమాల్లో నటించినా కూడా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. దాంతో గత మూడు ఏళ్లుగా టాలీవుడ్ కు దూరం అయ్యి మళ్లీ బెంగాళి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక బెంగాళి సినిమా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సోషల్‌ మీడియా ద్వారా ఈమె బిజీగా ఉంది.

రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజ్ తో వైట్ డ్రెస్ లో తెల్ల గులాబీని ధరించి ఉంది. చాలా మంది నెటిజన్స్ ఈ ఫోటోలకు ఫిదా అయ్యి తెగ షేర్‌ చేస్తూ లైక్ చేస్తున్నారు.

తెల్ల గులాబీ చేతిలో తెల్ల గులాబీ అన్నట్లుగా కామెంట్స్ త్రిధా చౌదరి అందంకు ఫిదా అవుతున్నారు. ఇంతటి అందగత్తెకు ఎందుకు అదృష్టం కలిసి రావడం లేదు పాపం అన్నట్లుగా కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అందంకు ఇక ముందు అయినా మంచి ఆఫర్లు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.