పిక్‌టాక్ : జలకాలటలో అందాల త్రిధా
ఈ ఏడాది హిందీలో రూపొందిన దిల్ దోస్తీ ఔర్ డాగ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిధా ఒకటి రెండు కొత్త సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 11 Jun 2025 12:22 PM ISTపదేళ్ల క్రితం నిఖిల్ హీరోగా నటించిన సూర్య vs సూర్య సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ త్రిధా చౌదరి. తెలుగులో మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. సూర్య vs సూర్య సినిమా తర్వాత తెలుగులో ఈమెకు మనసుకు నచింది సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా సైతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అందుకే టాలీవుడ్‌లో ఈమెకు ఆఫర్లు మొత్తానికి తగ్గాయి. తెలుగులో ఈమె చివరగా అయిదు ఏళ్ల క్రితం అనుకున్నది ఒకటి అయినది ఒకటి సినిమాలో కనిపించింది. ఆ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది.
ఈ ఏడాది హిందీలో రూపొందిన దిల్ దోస్తీ ఔర్ డాగ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిధా ఒకటి రెండు కొత్త సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా బెంగాలీ సినిమాల్లోనూ ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. హిందీ షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు, వెబ్ సిరీస్‌ల్లో ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రను చేయాలని ఆశ పడుతోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె షేర్ చేసే స్కిన్ షో ఫోటోలు ఎప్పటికప్పుడు ఆకట్టుకున్నాయి.
తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా త్రిధా సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈసారి స్విమ్మింగ్ పూల్ పిక్స్‌ను షేర్ చేసింది. బ్లాక్ బికినీ ధరించిన ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెటిజన్స్ చూపు తిప్పనివ్వడం లేదు. సాధారణంగానే ముద్దుగుమ్మలు స్విమ్మింగ్ పూల్‌లో అందాల ఆరబోతతో కుమ్మేస్తారు. అలాంటిది త్రిధా చౌదరి బ్లాక్ బికినీ ధరించి చూపు తిప్పుకోనివ్వకుండా ఆకట్టుకుంది. త్రిధా జలకాలటలో అందాల చూపిస్తూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు దక్కించుకోలేక పోయినా ఇలాంటి ఫోటోలతో అలరిస్తూ వస్తుంది.
ఇన్‌స్టాలో మూడు మిలియన్‌లకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఇలాంటి అందాల షో చేసిన ప్రతి సారి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇంత అందంగా ఉన్న త్రిధా ఎందుకు హీరోయిన్‌గా సక్సెస్ కాలేక పోయిందో పాపం అంటూ చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఆకట్టుకునే అందం ఉన్నప్పటికీ లక్ లేక పోవడం వల్లే ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు అయినా వరుస సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి ఈ అమ్మడు సినిమాలను మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
