Begin typing your search above and press return to search.

గామి ట్రైలర్: సింహంతో అఘోరా విశ్వక్

ఇక ఇప్పుడు ట్రైలర్ చూస్తూ ఉంటే కథలో మరింత భావం ఉన్నట్లు అర్ధమవుతోంది. అఘోరా పాత్రలో విశ్వక్ గెటప్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 12:52 PM GMT
గామి ట్రైలర్: సింహంతో అఘోరా విశ్వక్
X

యువ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన ప్రతీ సినిమాలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక అతని నుంచి భవిష్యత్తులో రాబోతున్న సినిమాలు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నాయి. ఇక వాటిలో గామి సినిమా ఒకటి. దర్శకుడు విద్యాధర్ కగిట తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా అడ్వెంచర్‌ డ్రామాగా రాబోతోంది.

అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా పనులన్నీ ఇప్పటికే ఫినిష్ అయ్యాయి. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ తోనే సినిమా కాన్సెప్ట్ పై ఒక హింట్ ఇచ్చారు. "అతడి అతి పెద్ద భయం మానవ స్పర్శ. అతడి లోతైన కోరిక కూడా మానవ స్పర్శ" అని కథపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ఇప్పుడు ట్రైలర్ చూస్తూ ఉంటే కథలో మరింత భావం ఉన్నట్లు అర్ధమవుతోంది. అఘోరా పాత్రలో విశ్వక్ గెటప్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. అతని టైమింగ్ డైలాగ్ తో పాటు మిగతా పాత్రలు హైలెట్ అయిన విధానం చూస్తూ ఉంటే దర్శకుడు టేకింగ్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ట్రైలర్ మొదట్లోనే సింహం గర్జన ఆ తరువాత అసలు నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను అంటూ అతను అఘోరా ఆశ్రమం నుంచి బయటకు వస్తాడు.

విశ్వక్ సేన్ క్రౌడ్ ఫండెడ్ అడ్వెంచర్ వస్తున్న గామి లో విశ్వక్ పాత్ర ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుందట. మానవ స్పర్శను అనుభవించలేని అతను నివారణ కోసం హరిద్వార్ నుండి హిమాలయాలకు ప్రయాణం చేస్తాడు. శారీరక సమస్యకు నివారణలో బాగంగా అన్వేషణ సాగిస్తాడు. కాన్సెప్ట్ తోనే ఈ సినిమా చాలా ఆలోచింపజేసే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు దేవదాసికి సంబంధించిన అంశం కూడా హైలెట్ అవుతోంది. సినిమాలో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఇలాంటి కథతో ఇప్పటివరకు వెండితెరపై ఎవరు చూపించలేదు. ఇక సినిమా అసలు కథ 2018లోనే ఫినిష్ చేసిన దర్శకుడు ఇన్నాళ్ళకు సినిమాను సరైన టైమ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటించగా అభినయ, మహమ్మద్ సమద్ మరియు హారిక పెడదా కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. గామి సినిమాను ప్రపంచం వ్యాప్తంగా మార్చి 8న విడుదల చేస్తున్నారు. ఇక కార్తీక్ శబరీశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్ బ్యానర్ సమర్పిస్తోంది.