Begin typing your search above and press return to search.

సర్కార్ నౌకరి ట్రైలర్.. సింగర్ సునీత వారసుడి సర్ ప్రైజ్ స్టోరీ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సర్కారు నౌకరి సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 7:39 AM GMT
సర్కార్ నౌకరి ట్రైలర్.. సింగర్ సునీత వారసుడి సర్ ప్రైజ్ స్టోరీ
X

సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే అనేక మంది వారసులు సరైన టైమ్ చూసుకుని టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తమ స్థానాలను సుస్థిరం చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సర్కారు నౌకరి సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

ఈ మూవీతోనే గంగనమోని శేఖర్ దర్శకుడిగా, భావనా వళపండల్ హీరోయిన్‌‌గా టాలీవుడ్కు పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. నేచురల్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

తెలంగాణలోని కొల్లాపూర్లో 1996లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దానికి తగ్గట్లే ట్రైలర్ మొత్తం అప్పటి సెట్టింగ్స్‌, కాస్ట్యూమ్స్‌తో నిండి ఉంది. హీరో, హీరోయిన్ల పెళ్లితో ట్రైలర్ ప్రారంభమైంది. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిగా ఆకాశ్(హీరో) పరిచయమయ్యాడు. అసురక్షితమైన శృంగారం గురించి ఆకాశ్ గ్రామస్థులకు అవగాహన కల్పిస్తుంటాడు. గ్రామ ఆరోగ్య కేంద్రాలకు, ప్రతీ ఇంటికి కండోమ్లు ఇస్తూ గ్రామస్థులను సురక్షితమైన శృంగారంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాడు.

కానీ అతడి చర్యను గ్రామస్థులు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ కండోమ్ ప్యాకెట్లను ఊర్లోని చిన్నపిల్లలు బూరలులాగా ఊదుకుంటూ ఆడుకుంటుంటారు. ఊరంతా కండోమ్ల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అతడి ఉద్యోగాన్ని హేళన చేస్తుంటారు. ఒకానొక సమయంలో హీరో భార్య కూడా తప్పుగా ఆలోచిస్తుంది. అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నిందిస్తుంది. అయితే అతడు చేసే ఉద్యోగం వల్లనో, మరే ఇతర కారణం వల్లనో ఊళ్లోకి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిక్కు తోచనోళ్లకు దిక్కు చూపించేందుకే సర్కార్ నౌకరీలు ఉన్నది.. సర్కార్ నౌకరి అంటే సర్కార్ జీతం తీసుకోవడం కాదు సర్.. ప్రజలకు సేవ చేయడానికి అంటూ హీరో చెప్పిన పవర్ పుల్ డైలాగ్తో ట్రైలర్ ముగిసింది.

ఈ మూవీని లెజెండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావుకు చెందిన ఆర్కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య, రాజేశ్వరి ముళ్లపూడి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శాండిల్య సంగీతాన్ని అందిస్తున్నారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గంగనమోని శేఖరే తీసుకున్నారు. 2024 జనవరి 1వ తేదీన మూవీ రిలీజ్ కానుంది. సింగర్ సునీత కుమారుడైన ఆకాశ్ ఈ మూవీతో ఫ్యాన్స్ను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి మరి.