Begin typing your search above and press return to search.

టాక్సిక్ లో ఆ హాటెస్ట్ హీరోయిన్ కూడా!

కె.జి.ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్స్ సృష్టించిన కన్నడ హీరో యష్ నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ ని వెయిట్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 April 2024 4:17 AM GMT
టాక్సిక్ లో ఆ హాటెస్ట్ హీరోయిన్ కూడా!
X

కె.జి.ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్స్ సృష్టించిన కన్నడ హీరో యష్ నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ ని వెయిట్ చేస్తున్నాడు. కె.జి.ఎఫ్ ముందు వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న యష్ ప్రశాంత్ నీల్ తో చేసిన కె.జి.ఎఫ్ తో నేషనల్ లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆఫ్టర్ కె.జి.ఎఫ్ యష్ సినిమా మీద ఆడియన్స్ ఫోకస్ పెట్టగా టాక్సిక్ అంటూ తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ తో సర్ ప్రైజ్ చేశాడు. కన్నడ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ టాక్సిక్ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా సినిమా కాస్టింగ్ పై లేటెస్ట్ న్యూస్ ఆడియన్స్ కి జోష్ ఇస్తుంది.


యష్ తో ఈసారి బాలీవుడ్ అందాల భామ రొమాన్స్ చేస్తుందని తెలుస్తుంది. యష్ టాక్సిక్ లో కరీనా కపూర్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ లేటెస్ట్ గా మరో బాలీవుడ్ బ్యూటీ టాక్సిక్ లో నటిస్తుందని చెబుతున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కియరా అద్వాని టాక్సిక్ సినిమాలో ఛాన్స్ అందుకుందని అంటున్నారు. ఆల్రెడీ హిందీలో భారీ సినిమాల్లో నటిస్తున్న కియరా తెలుగులో కూడా స్టార్ ఛాన్సులు అందుకుంటుంది.

రాం చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కియరా హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న వార్ 2 లో కూడా అమ్మడు అవకాశం అందుకుంది. ఇప్పుడు యష్ టాక్సిక్ లో కూడా కియరా ప్లే కొట్టేసిందని అంటున్నారు. యష్ ఈ సినిమాను కూడా కె.జి.ఎఫ్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం త్వరగా సినిమా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. యష్ సినిమాలో కియరా ఛాన్స్ అనగానే ఆమె ఫ్యాన్స్ అందరికీ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది.

యష్ టాక్సిక్ సినిమా 2025 ఏప్రిల్ రిలీజ్ టార్గెట్ తో చేస్తున్నారు. కె.జి.ఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టాక్సిక్ ని ప్లాన్ చేస్తున్నారు. కియరా, కరీనా లాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు సినిమాలో ఉన్నారని తెలుస్తుండగా టాక్సిక్ మీద హైప్ డబుల్ అవుతుంది.