తమిళ సినిమా తెలుగు రైట్స్‌కు భారీ పోటీ!
ఇప్పుడు ఇదే తరహాలో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన తమిళ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
By: Tupaki Desk | 6 May 2025 8:30 AMఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో ఎవరూ అంచనా వేయలేరు. భారీ తారాగణం, స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్‌తో తీసినా అందులో కథ, కథనాలు కరెక్ట్‌గా లేకపోతే దాన్ని ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. పెద్దగా పట్టించుకోరు. అదే కంటెంట్ బాగుండి అందులో పెద్ద స్టార్స్‌లేకపోయినా ప్రేక్షకులు దానికి బ్రహ్మరథంపడుతుంటారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటారు. ఆ మధ్య విఉదలైన `బలగం` ఈ విషయాన్ని నిరూపించి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మరథం పడతారని నిరూపించింది.
ఈ మూవీ తరువాత ఎన్నో చిన్న సినిమాలు కంటెంట్ ని నమ్ముకుని ప్రేక్షకుల ముందుకొచ్చాయి. విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే తరహాలో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన తమిళ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అదే టూరిస్ట్ ఫ్యామిలీ. దర్శకుడు, హీరో శశికుమార్ హీరోగా నటించారు. సిమ్రాన్ ఆయనకు జోడీగా నటించిన ఈ మూవీకి అభిషన్ జీవీనాథ్ దర్శకత్వం వహించాడు.
శ్రీలంక జాఫ్నాలో ఆర్థిక సంక్షభం తలెత్తడంతో ఆదేశాన్ని, ఉంటున్న జాఫ్నాని ఫ్యామిలీతో వీడిన ఓ వ్యక్తి చెన్నై చేరుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? అతని ఫ్యామిలీ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ప్రధాన కథ. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇండియాలో ఏప్రిల్ 29న, వరల్డ్ వైడ్‌గా మే 1న విడుదలైంది. కేవలం ఏడు కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి సూపర్ హిట్ టాక్‌తో రన్నవుతూ రూ.17కోట్లు రాబట్టింది.
అంతే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా ఈ మూవీ రూ.12 కోట్లని రాబట్టింది. తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమాపై మన వాళ్లు కన్నుపడింది. దీంతో తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. శశికుమార్, సిమ్రాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే కావడంతో దీన్ని తెలుగులో డబ్ చేయాలని మన వాళ్లు పోటీపడుతున్నారట. అయితే మేకర్స్ మాత్రం డబ్బింగ్ రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.