హిట్టు సినిమాకు రాజమౌళి సినిమాతో కంపేరిజన్లు.. ఏమంటున్నారు?
టూరిస్ట్ ఫ్యామిలీ.. రీసెంట్ గా తెరకెక్కిన ఆ సినిమా కోలీవుడ్ లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి.. భారీ విజయం సాధించింది.
By: Tupaki Desk | 11 Jun 2025 7:00 PM ISTటూరిస్ట్ ఫ్యామిలీ.. రీసెంట్ గా తెరకెక్కిన ఆ సినిమా కోలీవుడ్ లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి.. భారీ విజయం సాధించింది. ప్యూర్ కామెడీ, గుండెను హత్తుకునే ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో ఉన్న మూవీ.. సంచలన హిట్ అయిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
అభిషన్ జీవింతు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఎం. శశికుమార్ లీడ్ రోల్ లో నటించారు. సిమ్రాన్ కీలక పాత్ర పోషించారు. తక్కువ బడ్జెట్ తో నిర్మించగా, ఎక్కువ వసూళ్లు రాబట్టిన టూరిస్ట్ ఫ్యామిలీపై అనేక మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు జియో హాట్ స్టార్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఓటీటీలోకి వచ్చాక మాత్రం.. మూవీ లవర్స్ నుంచి సినిమాపై భిన్నమైన రెస్పాన్స్ లు వస్తున్నాయి. పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే.. పలు ప్రశ్నలు కూడా ఇప్పుడు లేవనెత్తుతున్నారు. నిజ జీవితంలో కూడా సినిమాల జరిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని అంటున్నారు.
శరణార్థుల అక్రమ ప్రవేశానికి సానుభూతి చూపడంతోపాటు మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి విషయాల్లో మూవీ తీవ్ర సమస్యాత్మకమైనదని చాలా మంది పేర్కొంటున్నారు. గొడ్డు మాంసం వినియోగం గురించి డైలాగ్స్ ను ఉదహరిస్తున్నారు. అయితే ఆ అభిప్రాయాలు థియేటర్లలో విడుదలైనప్పుడు లేకపోవడం గమనార్హం..
అదే సమయంలో కొందరు నెటిజన్లు.. ఛత్రపతి మూవీతో పోలుస్తుండడం గమనార్హం. ఆ సినిమాలో ప్రభాస్ సహా పలువురు.. శ్రీలంక నుంచి వలస వచ్చి వైజాగ్ కు శరణార్థులుగా చేరుకుంటారు. ఆ సినిమాలో ప్రభాస్ రోల్ ను అంతా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీలోని పాత్రలను సమస్యాత్మకమని కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఛత్రపతిలో ప్రభాస్ సహా ఇతరులు అధికారిక ఆశ్రయం పొందారని అంటున్నారు. ప్రభుత్వం వద్ద వారి రికార్డులు ఉన్నాయని, ప్రతిదీ వ్యవస్థ ప్రకారం జరిగిందని అంటున్నారు. మొత్తానికి టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ఇప్పుడు చర్చలకు దారి తీసిందన్నమాట. థియేటర్స్ లో ఉన్నప్పుడు ఎలాంటి చర్చలు జరగకపోయినా.. ఇప్పుడు మాత్రం తెగ మాట్లాడుకుంటున్నారు.
