Begin typing your search above and press return to search.

కఠినమైన నిర్ణయం.. తప్పలేదన్న సమంత

అలాంటి సమయంలో సమంత ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడం ఆమె కెరీర్‌ లో అత్యంత కీలక నిర్ణయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 11:30 AM GMT
కఠినమైన నిర్ణయం.. తప్పలేదన్న సమంత
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఒప్పుకోవాలే కానీ ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేయగల సత్తా మరియు స్టార్ డమ్‌ ఆమెకు ఉంది. అలాంటి సమయంలో సమంత ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడం ఆమె కెరీర్‌ లో అత్యంత కీలక నిర్ణయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్‌ పీక్స్ లో ఉన్న సమయంలో బ్రేక్ తీసుకోవడం, ఏడాది పాటు సమయం వృధా చేయడం పై సమంత తాజాగా ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తనకు ఏడాది బ్రేక్ తీసుకోవడం అనేది అత్యంత కఠినమైన నిర్ణయమే అంటూ సమంత చెప్పుకొచ్చింది.

కెరీర్ తో పోల్చితే ఆరోగ్యం కు ప్రాముఖ్యత ఇచ్చాను. అందుకే బ్రేక్‌ అనేది కఠినమైన నిర్ణయం అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమంత చెప్పుకొచ్చింది. ముందు ముందు ఎలాంటి ఇబ్బంది ఉండవని భావిస్తున్నట్లుగా సమంత పేర్కొంది.

ఏడాది బ్రేక్‌ పూర్తి చేసుకున్న సమంత కొత్త సినిమాలకు ఇంకా అధికారికంగా కమిట్‌ అవ్వలేదు. ఇప్పటి వరకు పలు కథలు విన్నట్లుగా తెలుస్తోంది. రీ ఎంట్రీ లో సమంత మొదటి సినిమా ఏ భాషలో ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత ఏడాది ఖుషి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత త్వరలో వరుణ్‌ దావన్‌ తో కలిసి నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత మరోసారి వెబ్‌ సిరీస్‌ తో ఓటీటీ ప్రేక్షకులను షేక్ చేయడం ఖాయంగా మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.