Begin typing your search above and press return to search.

2023 ఏడాదిని మిస్ చేసుకున్న టాప్ స్టార్స్ వీళ్ళే!

అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో పాటు మరికొందరు సీనియర్, యంగ్ హీరోలు కూడా ఉండడం గమనార్హం.

By:  Tupaki Desk   |   14 Dec 2023 12:30 AM GMT
2023 ఏడాదిని మిస్ చేసుకున్న టాప్ స్టార్స్ వీళ్ళే!
X

టాలీవుడ్ లో ఉన్న కొందరు స్టార్స్ 2023 ఏడాదిని పూర్తిగా మిస్ అయ్యారు. ఈ ఏడాది కొందరు స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో పాటు మరికొందరు సీనియర్, యంగ్ హీరోలు కూడా ఉండడం గమనార్హం. ఈ ఇయర్ లో మహేష్ నుంచి సినిమా రాలేదు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులోనే 'గుంటూరు కారం' సినిమాని విడుదల చేయాలనుకున్నారు.

కానీ త్రివిక్రమ్, మహేష్ మధ్య విభేదాల కారణంగా ప్రీ ప్రొడక్షన్ రెండుసార్లు వాయిదా పడడంతో చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో ఆగస్టు నుంచి 2024 జనవరి 12కి ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. అలా మహేష్ 2023 సంవత్సరాన్ని మిస్ అయ్యాడు. 'RRR' మూవీ తో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఆస్కార్ ప్రచారంలో పాల్గొనడంతో వాళ్ల కొత్త సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.

ఎన్టీఆర్ 'దేవర' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2024 ఏప్రిల్ లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది. మరోవైపు శంకర్ గత రెండు సంవత్సరాలుగా 'గేమ్ చేంజర్' షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. మరో రెండు నెలల పాటు ఈ మూవీ షూటింగ్ ఉండబోతోంది. దాని కారణంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ 2024 ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే, డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప 2' ని 2023 లో విడుదల చేయాలనే ప్రణాళికను విరమించుకున్నాడు.

ఎందుకంటే ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా వైడ్ భారీ సక్సెస్ అందుకోవడంతో సీక్వెల్ అంతకుమించి ఉండాలని ప్లాన్ చేశారు. దాంతో 2024 ఆగస్టు కి పుష్ప2 ప్లాన్ చేశారు. ఫలితంగా ఈ ఇయర్ అల్లు అర్జున్ నుండి ఎలాంటి మూవీ రిలీజ్ అవ్వలేదు. వీళ్లతో పాటు సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ యంగ్ హీరోలు రానా, శర్వానంద్ ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యకరం.గత ఏడాది 'ఒకే ఒక జీవితం' సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం తన 35వ సినిమాతో బిజీగా ఉన్నాడు.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పలు అనివార్య కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో 2023లో ఈ సినిమాని విడుదల చేయలేకపోయారు. అటు వెంకటేష్ ఈ ఇయర్ 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆయన నుంచి థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాలేదు. డిసెంబర్లో రిలీజ్ కావలసిన 'సైంధవ్' వచ్చే ఏడాది జనవరి 13 కి వాయిదా పడింది. ఇక వరుస ప్లాప్స్ తర్వాత నాగార్జున మూడు నెలల క్రిందే 'నా సామిరంగా' మూవీని స్టార్ట్ చేశాడు. దీనికంటే ముందు చాలా విరామం తీసుకున్నాడు. దీంతో ఈ ఏడాది నాగ్ నుంచి కూడా సినిమా రాలేదు