Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : టాప్ లేపిన ఫైనల్ ఎపిసోడ్ రేటింగ్..!

అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ టి.వి.ఆర్ రేటింగ్స్ తో ఆడియన్స్ అందరిని సర్ ప్రైజ్ చేసింది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 12:20 PM GMT
బిగ్ బాస్ 7 : టాప్ లేపిన ఫైనల్ ఎపిసోడ్ రేటింగ్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 పూర్తైంది. ఫైనల్ ఎపిసోడ్ తర్వాత జరిగిన నానా హంగామాతో ఆ షో గురించి కన్నా ఆ తర్వాత జరిగిన విషయంపై అందరు అప్సెట్ అయ్యారు. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బయటకు రావడం అతని ఫ్యాన్స్ చేసిన గొడవ వల్ల అతన్ని అరెస్ట్ చేయడం ఇలాంటివి షో మీద కాకుండా మిగతా వాటి మీద హడావుడి చేసేలా చేశాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ టి.వి.ఆర్ రేటింగ్స్ తో ఆడియన్స్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఆరు సక్సెస్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 7వ సీజన్ ఉల్టా పుల్టా అంటూ వెరైటీగా ప్లాన్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నుంచి ఆసక్తి పెంచగా మొదటి ఐదు వారాల కోసం 14 మంది కంటెస్టెంట్స్ ఆ తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇలా అందరు షో ని సూపర్ సక్సెస్ అయ్యేలా చేశారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ రేటింగ్ విషయంలో కూడా అదరగొట్టేసింది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ 21.7 రేటింగ్ తో అదుర్స్ అనిపించింది. ఇప్పటివరకు జరిగిన ఏ సీజన్ కి కూడా రాని రేటింగ్ ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కోసం రవితేజ, కళ్యాణ్ రాం, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, సుమ ఇలా అందరు వచ్చి షో సక్సెస్ కి కారణం అయ్యారు. ఇక ఈ సీజన్ విన్నర్ మీద ఆడియన్స్ లో ఒకరకమైన ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ వీరు ముగ్గురు ఫైనల్ విజేతకి పోటీ పడ్డారు. అయితే ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు.

సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి సెలబ్రిటీ గెస్ట్ వస్తారని వార్తలు వచ్చినా ఎవరు లేకుండా హోస్ట్ నాగార్జుననే విజేతని అనౌన్స్ చేశారు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఇద్దరు టాప్ 2 గా నిలవగా ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ టాప్ రేటింగ్ చూస్తేనే ఈ సీజన్ ఎంత సక్సెస్ అయ్యింది అన్నది అర్థం చేసుకోవచ్చు.