Begin typing your search above and press return to search.

భార‌త‌దేశంలో నంబ‌ర్‌-1 ఓటీటీ ఏది?

ఓటీటీ దిగ్గ‌జాల న‌డుమ పోటాపోటీ వాతావ‌ర‌ణం గురించి తెలిసిందే. అయితే భార‌తదేశంలో స‌బ్ స్క్రిప్ష‌న్ల ప‌రంగా ఏ ఓటీటీ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది

By:  Tupaki Desk   |   23 April 2024 2:45 AM GMT
భార‌త‌దేశంలో నంబ‌ర్‌-1 ఓటీటీ ఏది?
X

ఓటీటీ దిగ్గ‌జాల న‌డుమ పోటాపోటీ వాతావ‌ర‌ణం గురించి తెలిసిందే. అయితే భార‌తదేశంలో స‌బ్ స్క్రిప్ష‌న్ల ప‌రంగా ఏ ఓటీటీ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది? అంటే దానికి తాజాగా స‌మాధానం ల‌భించింది. తాజా డేటా ప్రకారం.. భార‌త‌దేశపు చందాదారులలో హాట్‌స్టార్ (5 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. జియో సినిమా (2.8 కోట్లు), అమెజాన్ ప్రైమ్ (2.25 కోట్లు), సోనీ లివ్ (1.25 కోట్లు), జీ5 (0.8 కోట్లు) తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆరవ స్థానంలో ఉంది. భార‌త‌దేశంలో నెట్ ఫ్లిక్స్ కి కేవ‌లం 0.65 కోట్ల మంది చందాదారులు మాత్ర‌మే ఉన్నారు.

నిజానికి మార్చి నాటికి మొత్తం 269.6 మిలియన్ల (సుమారు 27 కోట్లు) స‌బ్ స్క్రైబ‌ర్ల‌తో ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న నెట్ ఫ్లిక్స్ భార‌త‌దేశంలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రైమ్ వీడియో 20+ కోట్ల మంది సభ్యులతో ప్ర‌పంచ ర్యాంకింగ్‌లో రెండవ స్థానంలో ఉంది.

కార‌ణం ఏదైనా కానీ నెట్‌ఫ్లిక్స్ ప్ర‌స్తుత‌ త్రైమాసికానికి చందాదారుల సంఖ్యలను ప్ర‌క‌టించ‌డాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దానికంటే జ‌నాద‌ర‌ణ ఉన్న‌ ప్లాన్‌ల విజయాన్ని హైలైట్ చేస్తోంది. ఇది 40 శాతం సైన్-అప్‌లను కలిగి ఉంది. ఆదాయం 14.8 శాతం పెరిగి దాదాపు $9.4 బిలియన్ల (7,835 కోట్లు) కు చేరుకుంది. నిర్వహణ ఆదాయం సంవత్సరానికి 54 శాతం వృద్ధితో $2.6 బిలియన్ల (2,167 కోట్లు)కు చేరుకుంది. అయితే నెట్ ఫ్లిక్స్ భార‌త్ లో అంతంత మాత్రంగా ఉండ‌టానికి కార‌ణం నెట్‌ఫ్లిక్స్ తక్కువ సామూహిక-స్నేహపూర్వక కంటెంట్ (కుటుంబాలు క‌లిసి చూడ‌లేవు), అధిక చందా వ‌సూళ్ల‌ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటోంది.