Begin typing your search above and press return to search.

మన హీరోల టాప్ సినిమాలు.. కిక్కిచ్చే యాక్షన్ ఘట్టాలు

అలాగే భారీ మాస్, యాక్షన్ కథలతోనే హీరోల జర్నీ స్పీడ్ అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   9 March 2024 4:10 AM GMT
మన హీరోల టాప్ సినిమాలు.. కిక్కిచ్చే యాక్షన్ ఘట్టాలు
X

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీదనే ఫోకస్ చేశారు. యూనివర్శల్ కథలని తీసుకొని సిల్వర్స్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తూ తమ మార్కెట్, బ్రాండ్ వేల్యూ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వీరు చేస్తోన్న సినిమాలు అన్ని కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. అలాగే భారీ మాస్, యాక్షన్ కథలతోనే హీరోల జర్నీ స్పీడ్ అందుకుంటోంది.

ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో మూవీస్ చేసే మన స్టార్స్ ఇప్పుడు పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్ పవర్ యాక్షన్ ని ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. ఈ ఏడాదిలో అరడజను పాన్ ఇండియా సినిమాలు మన స్టార్ హీరోల నుంచి రాబోతున్నాయి. వాటిలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలని దర్శకులు డిజైన్ చేశారంట.

ఆడియన్స్ కి గూస్ బంప్స్ క్రియేట్ చేసే సన్నివేశాలు ఉంటాయని చిత్ర దర్శక, నిర్మాతలు కూడా చెబుతూనే ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా లీక్స్ ద్వారా సమాచారం బయటకొస్తున్నాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ తో కల్కి 2898ఏడీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో టెంపుల్ ఫైట్ హైలైట్ గా ఉండబోతోందంట. రైడర్ గ్యాంగ్ తో ప్రభాస్ తలపడే ఈ సీన్ ని నాగ్ అశ్విన్ అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ మూవీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో జాతరలో విలన్ తో తలపడే సీన్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోన్న మాట. సుకుమార్ ఈ సీన్ కోసం ఎక్కువ రోజులు టైం తీసుకొని మరీ పెర్ఫెక్ట్ గా షూట్ చేశారంట. టాలీవుడ్ లో ఇదొక ట్రేడ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ గా నిలిచిపోతుందంట. ఇక ఎన్టీఆర్ దేవర సినిమాతో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది.హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ తో ఈ సీక్వెన్స్ ని డిజైన్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ OG మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుందంట. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్స్ తో పవన్ కళ్యాణ్ ఈ సన్నివేశంలో తలపడతాడంట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కూడా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మూవీకి హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. శంకర్ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఏ లెవల్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గేమ్ చేంజర్ లో కూడా తన స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ ని శంకర్ డిజైన్ చేసారని తెలుస్తోంది.