Begin typing your search above and press return to search.

అత్యంత భారీ సెట్ల‌తో టాప్ 6 దేశీ క‌ళాఖండాలు

హీరమండి త‌ర‌హాలోనే ఇక్కడ 6 అత్యంత ఖరీదైన భారతీయ సినిమాల కోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు. ఇందులో వెబ్ సిరీస్ లు సినిమాలు కూడా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   8 May 2024 12:30 AM GMT
అత్యంత భారీ సెట్ల‌తో టాప్ 6 దేశీ క‌ళాఖండాలు
X

సంజయ్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన 'హీరామండి' ఒక దృశ్యమాన కళాఖండం. ఈ వెబ్ సిరీస్ కి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, క‌ళాత్మ‌కత, భారీత‌నం దృష్ట్యా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్ కోసం వేసిన భారీ సెట్లు, ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్, ఆభ‌ర‌ణాలు, న‌గిషీలు ఇలా ప్ర‌తిదాని కోసం భారీ బ‌డ్జెట్‌ని కేటాయించారు. వివాదాస్పదమైన ఖ్వాబ్‌గా చెక్క ఇంటీరియర్‌లతో డ్యాన్స్ హాల్‌లు, మెరిసే క్యారేజీలు, అద్భుమైన‌ పాలరాయి ఫౌంటైన్ .. మెరిసే షాన్డిలియర్ల వరకు ప్ర‌తిదానికోసం భ‌న్సాలీ భారీగా ఖ‌ర్చు చేయించారు. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ కోసం రాజీ అన్న‌దే లేకుండా బడ్జెట్ ని వెచ్చించింది. ఇది అసాధార‌ణ‌మైన సిరీస్.. దేశంలోనే ఖరీదైన వెబ్ సిరీస్ గా రికార్డుల‌కెక్కింది.

ఎనిమిది భాగాల పీరియడ్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ సౌజన్యంతో తెర‌కెక్కింది. నిర్మాణ బడ్జెట్ సుమారు రూ. 200 కోట్ల వరకు ఉందని క‌థ‌నాలొచ్చాయి. త‌న భారీ ప్రాజెక్ట్ కోసం పాత్ర‌ల‌కు ప్రాణ ప్ర‌తిష్ఠ చేయడం కోసం భన్సాలీ ఇంత మెగా బ‌డ్జెట్ ని కోరుకున్నారు. ప్రస్తుతం సోషల్ ఫోరమ్‌లలో హాట్ టాపిక్ అయిన బజ్జీ సిరీస్ లాగా, ఇప్పటివరకు అత్యంత ఖరీదైన సెట్‌లను హీరా మండి కోసం నిర్మించార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

హీరమండి త‌ర‌హాలోనే ఇక్కడ 6 అత్యంత ఖరీదైన భారతీయ సినిమాల కోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు. ఇందులో వెబ్ సిరీస్ లు సినిమాలు కూడా ఉన్నాయి.

1. దేవదాస్ (2002)

శరత్ చంద్ర లెగసీ నవల ఆధారంగా షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, మాధురీ దీక్షిత్ లాంటి భారీ తారాగ‌ణం నటించిన దేవదాస్ గొప్ప దృశ్యకావ్యంగా నిలిచింది. ఫిల్మ్‌ఫేర్‌లోని ఒక క‌థ‌నం ప్రకారం.. భ‌న్సాలీ 1930ల నాటి కలకత్తాలోని జమీందారీ గృహాలను ప్రతిబింబించేలా సెట్ ల‌ను నిర్మించ‌డం కోసం తొమ్మిది నెలలకు పైగా పని చేసాడు. ఈ సెట్ నిర్మాణానికి రూ. 20 కోట్లు ఖర్చవుతుందని, అందులో 12 కోట్లు చంద్రముఖి కోటను రూపొందించడానికి వెచ్చించార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ సినిమా కోసం భారీ సెట్లు మాత్ర‌మే కాదు... భారీగా ఆభ‌ర‌ణాలు, కాస్ట్యూమ్స్ వంటి వాటిని సేక‌రించారు. వీటి కోసం కోట్ల‌లో ఖ‌ర్చు చేసారు.

2. రుద్ర: ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (2022)

2022లో అజయ్ దేవగన్ డిస్నీ + హాట్‌స్టార్ కోసం 'రుద్ర: ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌' అనే సిరీస్ లో న‌టించాడు. ఇది అత‌డికి OTT అరంగేట్రం.. భారతదేశంలో అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్‌గా ఇది చార్ట్ లో అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటీష్ సిరీస్ లూథర్, రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌కి రీమేక్. ఒక ప్ర‌మాద‌క‌ర‌ సీరియల్ కిల్లర్ కోసం వేటాడే సూపర్ కాప్‌గా అజయ్ దేవగన్ నటించాడు. ఈ ధారావాహిక కోసం రూ. 200 కోట్లు ఖ‌ర్చు చేసార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దేవ‌గ‌న్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 21 కోట్లు వసూలు చేశాడు.

3. బాహుబలి: ది బిగినింగ్ (2015)

బాహుబలి: ది బిగినింగ్, S S రాజమౌళి తెర‌కెక్కించిన భారీ హిస్టారిక‌ల్ ఇతిహాసం. భారతీయ సినిమాని ఒక మలుపు తిప్పిన చిత్ర‌మిది. గ్రాండియారిటీ.. లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో విజువ‌ల్ వండ‌ర్ ని తెర‌కెక్కించారు రాజ‌మౌళి. ఈ మూవీలో మాహిష్మతి సామ్ర‌జ్య‌ సెట్ కోసం ఏకంగా రూ. 60 కోట్లు ఖర్చు చేశార‌ని టాక్ వ‌చ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ భారీ సెట్ ని వేసారు. ఈ సెట్ ని షూటింగ్ అయ్యాకా అలానే ఇప్ప‌టికీ ఉంచారు. రూ. 2,349 (ఒక్కో వ్యక్తికి) టిక్కెట్ ధ‌ర‌తో ఈ సెట్ ని ద‌ర్శించే వారితో ఇది ప‌ర్యాటక దృశ్యంగా మారింది.

4. బాంబే వెల్వెట్ (2015)

రణబీర్ కపూర్ - అనుష్క శర్మ నటించిన బాంబే వెల్వెట్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. తార‌ల‌కు ఇది చెత్త సెలెక్ష‌న్ గా మిగిలింది. 1950ల నాటి ముంబై ని సెట్లో డిజైన్ చేసారు. ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ డిజైన్ సర్టిఫైడ్ విజేతగా నిలిచింది. సెట్‌కు రూ. 16 కోట్లు ఖర్చయ్యాయి. అప్ప‌టికీ అనురాగ్ కశ్యప్ అతడి బృందం ఖర్చులను తగ్గించడానికి శ్రీలంకలో సినిమాను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు.

5. పోరస్ (2017)

భారతదేశంలో అత్యంత ఖరీదైన టీవీ షో ఇది. 2017 - 2021 మధ్యకాలంలో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమైన పోరస్ అనే సిరీస్ హైడాస్పెస్ యుద్ధం ఆధారంగా 249 ఎపిసోడ్‌లుగా తెర‌కెక్కింది. విపరీతమైన‌ సెట్ ల‌తో కూడిన ఎపిక్ హిస్టారికల్ సిరీస్ కోసం ఏకంగా 500 కోట్లు ఖ‌ర్చు చేసార‌ని DNAలో క‌థ‌నం వెలువ‌డింది.

వీకీలో స‌మాచారం మేర‌కు.. పోరస్ అనేది భారతదేశంలోని పౌరవ రాజ్యాన్ని పాలించిన పోరస్ .. మాసిడోనియా రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ జీవితాలను విజువ‌లైజ్ చేస్తూ, హైడాస్పెస్ యుద్ధం ఆధారంగా ఒక చారిత్రాత్మక డ్రామా టెలివిజన్ సిరీస్ ఇది. 27 నవంబర్ 2017 నుండి 13 నవంబర్ 2018 వరకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారం అయింది. స్వస్తిక్ ప్రొడక్షన్స్‌కు చెందిన సిద్ధార్థ్ కుమార్ తివారి ఈ ప్రదర్శనను రూపొందించారు. భారతీయ టెలివిజన్‌లో ఇది అత్యంత ఖరీదైన కార్యక్రమం. దాదాపు INR 500 కోట్ల బడ్జెట్ ని దీనికోసం ఖ‌ర్చు చేసారు.

6. జోధా అక్బర్ (2008)

మొఘలుల సామ్రాజ్యంలో అక్బర్ చక్రవర్తి పాలన నాటి కాల‌మాన ప‌రిస్థితుల ఆధారంగా రూపొందించిన భారీ చిత్రం - జోధా అక్బ‌ర్. అశుతోష్ గోవారికర్ 2008 లో ఈ క్లాసిక్ మూవీని తెర‌కెక్కించారు. దీనికోసం భారీ స‌ట్ల‌ను రూపొందించారు. ఇందులో హృతిక్ రోషన్ అక్బర్‌గా .. ఐశ్వర్య రాయ్ బచ్చన్ చక్రవర్తికి ఇష్టమైన జోధా బాయిగా నటించారు.సెట్ డిజైనర్ నితిన్ దేశాయ్... అమెర్ ఫోర్ట్.. ఆగ్రా ఫోర్ట్ ల‌ను క‌చ్చితమైన ఇంటీరియర్‌లతో డిజైన్ చేసారు. తరువాతి దీవాన్-ఐ-ఆమ్, దీవాన్-ఇ-ఖాస్, జోధా మహా ..మొఘల్ గార్డెన్‌లను కూడా పున‌ర్మించ‌డం కోసం కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేసారు. అప్ప‌ట్లోనే రూ.12 -20 కోట్ల బడ్జెట్‌తో అద్భుతమైన సెట్ ల‌ను రూపొందించారు.